స్వీట్లంటే ఇష్టపడని వారు ఉండరు. ఇళ్లలో మహా అయితే రెండు మూడు రకాల స్వీట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బయట షాపులలో బోలెడు రకాల స్వీట్లు ఉంటాయి. ఇవి వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో చూడగానే తినేయాలనిపించేలా ఆకర్షిస్తాయి. కొన్ని ఖరీదైన స్వీట్లను గమనిస్తే వాటి మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇలా వెండి పూత కలిగిన స్వీట్లు పెద్ద పెద్ద షాపులలో ఎక్కువ ఖరీదులో ఉంటాయి. ఈ వెండి పూతను వరాక్ అని పిలుస్తారు. చాలామంది అలంకరణ కోసం ఈ పూత వేస్తారని అనుకుంటారు. కానీ ఇలా స్వీట్ల మీద వెండి పూత వేయడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి.
మోతీచూర్ లడ్డూ, కాజూ కట్లీ, కాజూ పిస్తా రోల్స్ వంటి స్వీట్ల మీద వెండి పూత ఉంటుంది. పాలతో మాత్రమే చేసే వివిధ స్వీట్లకు కూడా ఈ వెండి పూత అప్లై చేస్తారు. స్వీట్ల మీద అప్లై చేసే వెండి పొరలో నిజంగానే శుద్దమైన వెండి ఉపయోగిస్తారు. శుద్దమైన వెండితో తయారైన వెండిపూత ఉన్న స్వీట్లు చాలా ఆరోగ్యం.
వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా స్వీట్ల మీద వెండి పూత వేస్తే స్వీట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేకపోతే పాలతోనూ, నెయ్యితోనూ చేసిన స్వీట్లు తొందరగా ముక్కిపోయిన వాసన వస్తాయి. మొట్టమొదట స్వీట్ల మీద వెండి పూత వేయడం మొదలైంది కూడా ఈ కారణంతోనే.
అయితే వెండి అనేది ఖరీదైన లోహంగా మారడం వల్ల స్వీట్ల మీద వెండి పూత వేయగానే సాధారణ స్వీట్లు కూడా ధర కొండెక్కి కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద షాపులు స్వీట్లు చాలా అట్రాక్షన్ గా కనిపించడం కోసం వెండి పూతను ఎంచుకుంటారు.
.
*నిశ్శబ్ద.