ముఖానికి వెట్ వైఫ్స్ వాడుతున్నారా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

నేటికాలంలో శుభ్రత అనేది చాలా అప్డేట్ అయ్యింది. చాలా మంది శుభ్రత కూడా లగ్జరీగా ఉండేలా చూసుకుంటున్నారు. వాటిలో బాగమే వెట్ వైఫ్స్.. చాలామంది ముఖం శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు. ఇందులలో అమ్మాయిలే ఎక్కువ.  మేకప్ తొలగించడానికి , ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి వెట్ వైఫ్స్ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి.  అంతేకాకుండా, వేసవిలో  మురికి,  చెమట చాలా తొందరగా పట్టేస్తుంటాయి.  వీటిని తొలగించుకోవడానికి ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు. పైగా వీటిని వాడటం వల్ల మురికి, చెమట వంటివి తొందరగా, పూర్తీగా తొలగిపోవడమే కాకుండా ముఖ చర్మానికి చాలా మేలు చేస్తాయని కూడా అనుకుంటారు.  కానీ ఇవి ముఖానికి మేలు చేయకపోగా నష్టమే ఎక్కువ చేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  వెట్ వైఫ్స్ వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. అవేంటంటే..

వెట్ వైఫ్స్ వల్ల కలిగే నష్టాలు..

ముఖం నుండి తేమ తొలగింపు..

చాలా వెట్ వైప్స్‌లో వివిధ రకాల సువాసనలు , ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ రోజుల్లో గులాబీ, లావెండర్, పుదీనా , నిమ్మ సువాసన గల వైప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడినప్పుడు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది, కానీ  వాటి సువాసన అలర్జీలకు కారణం కావచ్చు. ఈ పదార్థాలు చర్మంలోని సహజంగా ఉండే  తేమను తొలగించి, పొడిబారడం, చికాకు , చర్మం ఎర్రబడటం వంటి వాటికి  దారితీస్తాయి. అంతేకాకుండా, వైప్స్ చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచవు. అవి చర్మ రంధ్రాలను మూసివేసి, మొటిమలు , బ్లాక్‌హెడ్స్‌కు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

అలర్జీ, దురద..

సున్నితమైన చర్మం ఉన్నవారు వెట్ వైఫ్స్  వాడకాన్ని చాలా తగ్గించుకోవడం మంచిది. పదేపదే వాడటం వల్ల చర్మం ఎర్రబడటం, మంట కలగవచ్చు. దీనిలోని సువాసన అలెర్జీ రియాక్షన్స్ కు, దురదకు కూడా కారణం కావచ్చు.

వేసవిలో ఎక్కువ..

వేసవి కాలంలో సాధారణ కాలంలో కంటే ఎక్కువగా వెట్ వైఫ్స్ వాడుతుంటారు.  వేసవి కారణంగా ముఖం మీద పేరుకునే జిడ్డు, మురికిని వెట్ వైఫ్స్ తొలగిస్తాయని అనుకుంటారు. ఈ కారణంగా వేసవిలో వెట్ వైఫ్స్ ఎక్కువ వాడతారు.  కానీ వెట్ వైఫ్స్ ఎక్కువ వాడటం వల్ల చర్మం బిగుతుగా అనిపిస్తుంది.  ఇది క్రమంగా చర్మం మీద దద్దుర్లు, అలెర్జీ,  మొటిమలు వంటివి రావడానికి కారణం అవుతుంది. ఈ సమస్యలు కూడా రాత్రికి రాత్రే రావని, వెట్ వైఫ్స్ ను ఎక్కువగా వాడటం వల్ల క్రమంగా చర్మం మీద ప్రభావం పడటం వల్ల ఇలా జరుగుతుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

వెట్ వైఫ్స్ వాడినప్పుడు చర్మానికి చల్లని ఫీలింగ్ కలుగుతుంది.  కానీ ఇది వెట్ వైఫ్స్ లో ఉండే థైలిసోథియాజోలినోన్ అనే రసాయనం వల్ల ఇలా జరుగుతుంది. ఈ   రసాయనం చర్మానికి హానికరం. ఇది సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగించే ఒక సింథటిక్ ప్రిజర్వేటివ్  మాత్రమే కాదు.. క్రిమిసంహారకం కూడా. ఈ వైప్స్‌ను రోజూ వాడటం వల్ల ముఖంలోని సహజ నూనెలు తగ్గిపోయితాయి.  చర్మం యొక్క రక్షణ పొర బలహీనపడుతుంది. కాబట్టి వెట్ వైఫ్స్ తో జాగ్రత్త.

                                    *రూపశ్రీ.