కాల్షియం ఎదిగే పిల్లల నుండి మహిళలు, పురుషులు, వృద్దులు ఇలా అందరికీ చాలా అవసరం. శరీరంలో కండరాలు, నరాల పనితీరుకు, ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం అవసరమవుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 1,000 mg కాల్షియం అవసరం. తగినంత కాల్షియం అందకపోవడం వల్ల, ఎముకలలో బలహీనత, కండరాల తిమ్మిరి, వేళ్లు, కీళ్లలో నొప్పి, ఎముకలు త్వరగా పగుళ్లు రావడం. దంతాలు, చిగుళ్ళు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి చాలామంది పాలు, గుడ్లు బాగా తీసుకోవాలని అంటారు. కానీ శాఖాహారులకు కాల్షియం లోపం ఎంతో కొంత ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ఈ కింద చెప్పుకునే పండ్లు తీసుకుంటే చాలు..
నారింజ..
క్యాల్షియం పుష్కలంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటి. 100 గ్రాముల నారింజలో 45 నుండి 50 mg కాల్షియం మరియు వివిధ విటమిన్లు ఉంటాయి. ఇది కాకుండా, నారింజలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక నారింజ పండు తింటే కాల్షియం లోపమే ఉండదు.
నేరేడు..
నేరేడు పండ్లలో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. 100గ్రాముల నేరేడు పండ్లలో 15 mg కాల్షియం ఉంటుంది.
అంజీర్..
100 గ్రాముల ఎండిన అత్తి పండ్లను తీసుకుంటే 160 mg కాల్షియం పొందవచ్చు. ఇది ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన కాల్షియంను మెండుగా అందిస్తుంది.
కివి..
కివిలో కాల్షియం, శరీరానికి మేలు చేసే అనేక ఇతర ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎంతో రుచికరమైన పండు. 100 గ్రాముల కివిలో 30 mg కాల్షియం ఉంటుంది. ఒక గ్లాసు కివిలో జ్యూస్ లో 60 mg కాల్షియం ఉంటుంది.
మల్బరీ..
మల్బరీ క్యాల్షియం పుష్కలంగా ఉండే పండు. ఇది బెర్రీల కుటుంబానికి చెందిన పండు. ఒక కప్పు మల్బరీలో 55 mg కాల్షియం ఉంటుంది. వీటిని నేరుగా అయినా తినవచ్చు. స్మూతీలు, జ్యూస్‌లు డెజర్ట్‌లలో చేర్చుకోవచ్చు.
రేగు పండ్లు..
రేగు పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని నేరుగా అయినా తినవచ్చు. అదే విధంగా ఫ్లం పండ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా రేగు కుటుంబానికి చెందిన పండ్లు. వీటిలో కూడా కాల్షియం మెండు. వీటిని జ్యూస్ గా తీసుకోవచ్చు. ఒక గ్లాసు ప్లం జ్యూస్‌లో 55 mg కాల్షియం ఉంటుంది.
ఎండుద్రాక్ష..
తెలుపు, నలుపు ఎండు ద్రాక్షలో కూడా కాల్షియం బాగుంటుంది. ఇవి బిపిని నియంత్రించడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడతాయి. ఒక కప్పు ద్రాక్షపండు రసంలో 50 mg కాల్షియం ఉంటుంది. నల్ల ఎండుద్రాక్ష గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది, వాపును తగ్గిస్తుంది. 100 గ్రాముల నల్లద్రాక్షలో 55 mg కాల్షియం ఉంటుంది.
నిమ్మకాయలు..
నిమ్మకాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మకాయలో 33 mg కాల్షియం ఉంటుంది. ఇది కాకుండా.. విటమిన్ సి వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జబ్బులతో పోరాడటానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , మలబద్ధకం వంటి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలోనూ సహాయపడుతుంది.
బొప్పాయి..
బొప్పాయి పోషకాలతో నిండిన రుచికరమైన పండు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలలో బొప్పాయి ఒకటి. 100 గ్రాముల బొప్పాయిలో 20 mg కాల్షియం ఉంటుంది. ఇది కాకుండా బొప్పాయి పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాల నుండి రక్షించడంలో, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
*నిశ్శబ్ద.