చలికాలం వచ్చిందంటే చాలు  జలుబు దగ్గు  మనల్ని వదిలిపెట్టవు.  జలుబు దగ్గు కారణంగా మనకు చాలా చికాకు కలుగుతుంది.  ముఖ్యంగా జలుబు దగ్గు అనేది ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తాయి.  చలికాలంలో ఎండ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది వాతావరణంలో పెరుగుతుంది.  ఫలితంగా జలుబు దగ్గు లాంటి వ్యాధులు తీవ్రతరం అవుతూ ఉంటాయి. . అయితే మీరు దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే ఆయుర్వేదంలో చాలావరకు పరిష్కారాలు ఉన్నాయి.  ఇంగ్లీష్ మందులు ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.  కావునా  కొన్ని సులభమైన పరిష్కారాలతో మీ  దగ్గు జలుబును వదిలించుకోవచ్చు.

దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులను కూడా ఉపయోగించవచ్చుజామ ఆకుల్లో ప్రొటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి, సి ఉంటాయి. ఇది యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది.

దగ్గు నివారణకు జామ ఆకులను ఇలా ఉపయోగించండి:

జామ ఆకుల కషాయం:

కషాయం తాగడం దగ్గు  గొంతుకు చాలా మంచిది. జామ ఆకుల నుండి కూడా డికాక్షన్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం, ఒక పాత్రలో నీటిలో జామ ఆకులను ఉడకబెట్టండి. కాసేపయ్యాక ఎండుమిర్చి, అల్లం, లవంగాలు, యాలకులు వేయాలి. వాటిని 5 నిమిషాలు ఉడికించి, ఫిల్టర్ చేసి త్రాగాలి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

 జామ ఆకు నీరు:

ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి దగ్గు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి జామ ఆకుల నీరు త్రాగడం మంచిది. దీని కోసం, ఒక పాత్రలో జామ ఆకులను శుభ్రం చేసి మరిగించి, నీరు మారే వరకు వేడి చేయండి. తర్వాత వాటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

జామ ఆకుల పొడి:

దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం జామ ఆకులను బాగా కడిగి ఆరబెట్టాలి. వాటిని ఆరిన తర్వాత మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోవాలి. మీరు ఈ జామ ఆకుల పొడిని పాలు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.