అమృత ఆహారంతోనే ఆరోగ్యం  అన్న అంశాన్ని గతంలో ఒక వ్యాసంలో ప్రచురించాం. అందులో పచ్చి కూరగాయలు, పచ్చి ఆకు కూరలు,  పళ్ళు వాటి వల్ల వచ్చే ఫలితాలు గురించి చర్చించాం. అయితే అమృత ఆహారంలో రెండవ సూత్రంలో మొలకలు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మానవశరీరానికి నాణ్య మైన కొవ్వు పదార్ధాలు వచ్చేది మొలకల నుంచే అని అంటున్నారు నిపుణులు. అత్యధికంగా మనకు లభించే ప్రోటీన్లు బీన్స్,ఫల్లీలు,నట్స్ నుంచే అని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో విత్తనాలు, పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వాటిని నీళ్ళలో నాన బెట్టిన తరువాత వచ్చే మొలకల వాటివల్ల మరింత ప్రోటీన్ వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శరీరానికి ప్రోటీన్ల ఆవశ్యకత ఏమిటి అన్న విషయం వచ్చినప్పుడు. మనం తీసుకునే బీన్స్ శనగలు, పప్పు దినుసులలో అవసరమైన పీచు పదార్ధాలు ఉంటాయి.

పీచు పదార్ధం శరీరానికి బరువును పెంచుతుంది. పూర్తి శక్తివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మొలకలు శరీరానికి అల్కనైజ్ చేయడం ద్వారా చాలా రకాల అనారోగ్యలను నిలువరించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొనే ఎసిడిటీ, క్యాన్సర్, వంటి సమస్యలను నిలువరించడంలో సహాయపడుతాయి. మొలకలు. శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాదు. శరీరంలో మూలకణాలను వృద్ధి చేస్తుంది. ప్రోటీన్ ద్వారా డి ఎన్ ఎ పునరుత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది ప్రోటీన్లు రోబుస్ట్ ను  ఆరోగ్యవంతమైన  కణాలను ఇస్తాయి . పెసలు ముఖ్యంగా మొలకెత్తిన పెసలు, నాణ్యమైన ప్రోటీన్ తో పాటు యాంటి ఆక్సి డెంట్ ను శరీరానికి అందిస్తుంది. పెసలు, పెసర పప్పు భారతదేశంలో ఇక్కడ మాత్రమే వృద్ధి చెందింది. ఇది మంచి  బలమైన ఆహారంగా పేర్కొన్నారు. పురాతన కాలంలో సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంలో దాదాపు 1500  వందల సంవత్సరాల క్రితమే మొలకలను తీసుకునే వారని శాస్త్రం చెపుతోంది.అందుకే ఆనాటి కాలం లో ఏది తిన్న అరిగిపోయేదని వైద్యులు పేర్కొన్నారు. పచ్చటి ధాన్యాలు చాలా సులభంగా అరిగి పోతాయి.

ఇతర బీన్స్ తో పోలిస్తే అధిక మొత్హం లో పోషకాల తో పాటు మాంగనీస్, పొటాషియం  మెగ్నీషియం,పొటాషియం కాపర్, జింక్,ఇతర విటమిన్స్ విటమిన్ బి,విటమిన్ కె, విటమిన్ సి ఐరన్, హై ప్రోటీన్, తో పాటు గంజి, అరుగుదలకు అవసరమైన పీచు పదార్ధాలు. విటమిన్ బి ద్వారా డి ఎన్ ఎ ఉత్పత్తికి నూతన కణాల వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇవి మిమ్మల్నిమీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకలు,ఫల్లీలు,సోయా బీన్స్, సెనగలు,వంటివి అందరికీ సరిపడవు. వారి వారి వయసులను బట్టి. శరీరతత్వాన్ని బట్టి మెటా బాలిక్ శక్తిని బట్టి కొన్నిటిని వదిలి పెట్టాలి అంటున్నారు నిపుణులు. శరీరానికి వ్యాయామం చేసేవారు ఎక్కువగా మొలకలు, సోయా బీన్స్ ఎక్కువగా తీసుకుంటారు. శరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం.