శరీరంలోని కీలక అంగాలు సరిగ్గా పని చేయాలంటే శరీరానికి ఖనిజాలు అవసరం. ప్రతి సెకను ప్రతి రోజూ మన శరీరం ఖనిజాల పైనే ఆధారపడి ఉంటుంది.ముందుగా అసలు ఖనిజాలు ఎక్కడ ఉంటాయో కనుక్కోవాలి. ఖనిజాల వల్ల కొన్నిబిలియన్ల్స కణాలు స్పందిస్తాయి. ఇవి ఒకవిధంగా చెప్పాలంటే  విద్యుత్ తరంగాలు తగలగానే మనం ఎలా స్పందిస్తామో ఖనిజాల వల్ల మన శరీరంలో ఉన్న మెదడు, గుండె అలా స్పందిస్తుంది. స్పందించడమే కాదు సరిగా పనిచేసే విధంగా  ఖనిజాలు సహకరిస్తాయి. శరీరంలో ఉన్న ఖనిజాల మూలంగా ఓస్మోసిస్ వల్ల శరీరంలో ఉన్న  నీటి వత్తిడిని నియంత్రించి పోషకాలను తీసుకుంటుంది. శరీరానికి చాలా ఖనిజాలు కావాలి. వాటిని తప్పక వాడాల్సిన  అత్యవసరమైన ఖనిజాలుగా పేర్కొన్నారు. ఇవి కొన్ని సందర్భాలలో రెండుగా విభజింపబడ్డాయి అవి మ్యాక్రో ఖనిజాలు, మైక్రో ఖనిజాలు ఈ రెండు ఖనిజాలు సమానమైనవి కీలకమైనవే అని నిపుణులు విశ్లేషించారు. ఖనిజాలు పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అవసరం. ఖనిజాలు తక్కువ అవసరమన్న సంకేతం మనకు ఇవ్వదు. అయితే ఆ ఖనిజాలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయని మన శరీరం సరిగ్గా పని చేయాలంటే పూర్తి స్థాయిలో సహజమైన ఉప్పుఖనిజాలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు. 

ఖనిజాలను కనుగోనడం అత్యవసరమని వాటిని సక్రమంగా అందించినప్పుడే అటు మెడకు, ఇటు నరాలకు ఒక విద్యుత్ తరంగాలుగా పని చేస్తాయి. ఖనిజాలు హార్మోన్ ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తాయి. ఖనిజాలు కేవలం ఒక సెల్ల్యులార్ స్థాయిలో మెటబాలిజంను నియంత్రించడంలో  కీలకంగా వ్యవహరిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం 90 % ప్రజలు ఖనిజాల లోపంతో బాదపడుతున్నారని అంచనా. ఖనిజాల సమాతౌల్యం లోపం నివారించాడానికి హిమాలయ రాక్ సాల్ట్ లో 84రకాల ఖనిజాలు ఇందులో ఎలక్ట్రో  లైట్స్ ,  కాల్షియం అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్  వంటివి లభిస్తాయని నిపుణులు తేల్చారు. సహజంగా సంప్రదాయ బద్దంగా తాజా పప్పులు, తాజా పళ్ళు, కూర గాయాలు, పోషకాలతో పాటు సారవంతమైన భూమిలో సహజంగా ఐరన్, ఖనిజాలు లభిస్తాయి.  కానీ, దురదృష్ట వసాత్తూ నేడు ప్రపంచంలో భూములలో సహజంగా లభించే పోషకాలను మనం గుర్తించకపోవడం గమనించవచ్చు.

ఆధునిక వ్యవసాయం పేరుతో మనం చేస్తున వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహారక మందుల పైనే ఆదారపడడాన్ని మనం గమనించవచ్చు అలాగే భూమికోతకు గురికావడం, ప్రకృతి విపత్తుల వల్ల మనకు భూమి ద్వారా లభించే పోషకాలు కోల్పోతున్నామని  నిపుణులు అన్నారు. ఇప్పటికే సహజంగా ప్రకృతి నుంచి  లభించే  ఖనిజాలు కనుమరుగుకావడం పై  శాస్త్రజ్ఞులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ భూమిలో ఉండాల్సిన సహాజ ఖనిజాలు లోపిస్తే వాటి ప్రభావం ఆయా పంటలు ఉత్పత్తి పైన పడే అవకాశం ఉందని నిపులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా భూమిపై కృత్రిమ ఎరువులు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా రావల్సిన సహజ ఖనిజాలు లోపిస్తున్నాయని  ఇది ప్రకృతి సమతౌల్యం ఏర్పడి, వాతావరణాన్ని సైతం కలుషితం చేస్తున్నాయని ఈ విషయం తీవ్రంగా పరిగణించాలని శాస్త్ర వేత్తలు సూచించారు.అందుకు మానవ జీవితానికి ఖనిజాలు తప్పనిసరి అని నిపుణులు సూచించారు.