చెవిలో పేరుకుపోయిన గుమిలి అలాగే ఉంటే చెవుడు వస్తుందా ?  చెవులో పేరుకుపోయిన గుమిలి తీయడానికి చిన్నప్పుడు అమ్మ చాలా తంటాలు పాడేది ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసారు. సహాజంగా స్త్రీలు వారు పెట్టుకునే పక్కపిన్నులు లేదా జడపిన్ను పెట్టి అప్రయత్నంగా చెవిలో పెట్టి గుమిలి తీసే ప్రయత్నం చేస్తారు. అలాగే పురుషులు  అగ్గి పుల్లలు పెట్టి మరీ చెవిలో గుములు తీసేవారు. ఇంకాస్త ముందుకు వెళ్లి ఖాళీగా కూర్చుని ఊసుపోక పుల్ల పెట్టి అదేపనిగా గుబిలి తీయడానికి ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మ చెవిలో నూనె పోసి గుబిలి తీసేవారు నేను  ఆ నొప్పి  భరించేవాడిని కాదు.  నాకు దాదాపు మూడు సంవత్సరాలు అనుకుంటా నేను ఇయర్ ఎయిడ్స్ ఇష్టపడే వాడిని కాదు. మా అమ్మ ఒకటి రెండుసార్లు ఇయర్ బడ్స్ ను పెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా చేసినప్పుడు ఒచ్చిన ఆ నొప్పి ఇప్పటికి ఇంకా నాకు గుర్తుంది. ఆ విషయం అలా ఉంచితే, ఈ మధ్యలో నా చేవిని శుభ్రం చేయలేదు. గుమిలి తీయకుండా అలాగే ఉంచాను. ఇప్పుడు కాటన్ స్వప్స్  వాడడం మొదలుపెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు..   చెవులో పేరుకు పోయిన గుమిలి తీసే ప్రయత్నం చేసాను. ఒక చోట పెట్టబోయి మరోచోట కాటన్  స్వాప్ ను పెట్టాను. గుమిలి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేసాను. అప్పటికే ఆ గుమిలి బాగా గట్టిపడిపోయింది. చెవిలో ఉన్న ఇయర్ కెనాల్ మూసుకుపోయింది. ఇప్పుడు ఊహించండి అప్పుడు ఏమయ్యిందో?  ఆ అదే నిజం నా చెవిలో గుమిలి పూర్తిగా నిండిపోయింది. అప్పటికే నా వయస్సు 50 సంవత్సారాలు దీని నుండి బయటపడలేకపోయాను. చివరికి శుభ్రం చేయాలని  ప్రయత్నం చేస్తే తీవ్ర మైన సమస్యలు ఎదురయ్యాయి. అది ఒక్కటే కాదు. నేనే చాలా భయపడ్డాను. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ విషయం తెలిసింది. నా చెవి నాళం పూర్తిగా మూసుకుపోయిందని. చెవిలో గుమిలి పేరుకు పోవడాన్ని పరిశోధనలు చేశారు.  చెవిలో గుమిలి పేరుకు పోవడం వల్ల  దిమ్నీషియా  వస్తుందని తెలిసింది. చెవిలో పేరుకు  పోయిన గుమిలి వల్ల చెవిలో హోరు వస్తుంది అది మీ చెవి సమస్యకు గురైందని మొదటి హెచ్చరికగా వైద్యులు పేర్కొన్నారు. దేనివల్ల భవిష్యత్తులో చెవిలో వినికిడి లోపం వస్తుందని అనడానికి  ఇది అప్రమత్తం  చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు.  అయితే దీర్ఘకాలంగా చెవుడు  సమస్య రావచ్చని అయితే చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. సమాజంలో పూర్తిగా ఇబ్బందులు  పడాల్సి ఉంటుంది. సమాజంలో అందరికంటే వెనకబడిపోయమన్న భావన, వినికిడి లోపం వల్ల త్వరగా స్పందించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోక తప్పని స్థితి వస్తుంది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న పాటి ఇయర్ ఇంప్లాంట్స్  వచ్చిన నేపథ్యంలో కక్లర్ ఇంప్లాంట్స్ వచ్చాక వినికిడి సమస్యకు పరిష్కారం వచ్చిందని నిపుణులు అంటున్నారు.