తరచుగా అపానవాయువు, బరువు పెరగడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించానికి చాలామంది జీర్ణశక్తిని పెంచే టాబ్లెట్స్, సిరప్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. కానీ ఇవన్నీ సహజమైన జీర్ణవ్యవస్థను దెబ్బతీసేవే. వీటి వాడకం వల్ల సహజంగా ఆహారం జీర్ణం కాదు.కానీ ఆయుర్వేదం ఈ సమస్యలకు అన్నింటికి మంచి పరిష్కారాలు సూచించింది. అది కూడా ఇంటిపట్టున తక్కువ ఖర్చుతో ఈ సమస్యలు అధిగమించవచ్చు. కడుపు సమస్యలను అన్ని పరిష్కరించడంలో  సొంపు లేదా సోపు చక్కగా సహాయపడుతుంది. అసలు సోపులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? సోపును ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి పూర్తీగా తెలుసుకుంటే..


సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

సోపు తినడం వల్ల బలం చేకూరుతుంది.  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
పిత్త దోషం సాధారణంగా  వేడి ఎక్కువ కావడం వల్ల కలుగుతుంది.  అధికవేడి  వల్ల కలిగే రక్తస్రావ రుగ్మతలలో కూడా సోపు ఔషదంగా  ఉపయోగపడుతుంది
జీర్ణ శక్తిని పెంచుతుంది.  గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.
 బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
సోపు నీరు శరీరంలోని ధాతువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, ఇది పాలిచ్చే స్త్రీలలో తల్లి పాలను పెంచుతుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
సోపులోని సాత్విక లక్షణాలు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా  మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళ్ళకు రిఫ్రెష్‌గా కూడా సహాయపడుతుంది. శ్వాసకోశ,  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పెరిగిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.

 సోపును ఎవరు ఎలా ఉపయోగించాలంటే..

జీర్ణ సమస్యలకు - అసిడిటీ,  పిత్త సమస్యలకు, అర టీస్పూన్ పంచదారతో 1 టీస్పూన్ సోపు విత్తనాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి తినాలి.

బరువు తగ్గడం, దగ్గు, జలుబు, నెలసరి తిమ్మిర్లు, వికారం, కడుపులో నులిపురుగులు వంటి సమస్యల కోసం సోపుతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగాలి.

 సోపు టీ  కోసం..

 1 టీస్పూన్ సోపును 1 గ్లాసు నీటిలో 3-5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసి, సిప్ బై సిప్ త్రాగాలి.
మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత సోపు టీని త్రాగాలి.
1 గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర, కొత్తిమీర,  సోపు వేసి 5 నిమిషాలు ఉడికించి వడపోసి, సిప్ బై సిప్ త్రాగాలి. ఇలా చేస్తే కేవలం రెండే రెండు నిమిషాలలో కడుపు శుభ్రమవుతుంది.

                                                          *నిశ్శబ్ద