బాదం పప్పు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ  బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటె  గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, మెదడును చురుగ్గా మార్చుతుంది.  బరువు తగ్గడానికి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, జుట్టు పెరుగుదలలోనూ చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, బాదం  హానికరం. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల  ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకుంటే..


తరచుగా కడుపులో మంట లేదా యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం  గురించి ఫిర్యాదు చేసేవారు,  బాదం తీసుకోవడం తగ్గించాలి, ఇది  సమస్యను మరింత కడుపులో యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది.

బాదంపప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుకు దూరంగా ఉండాలి.

బాదంపప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం పప్పును ఎక్కువగా తీసుకోవడం లేదా నానబెట్టకుండా   తీసుకోవడం వల్ల కడుపులో భారం అంటే ఉబ్బరం, విరేచనాలు,  పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి.

బాదంపప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పచ్చి బాదంపప్పులు తీసుకోవడం వల్ల నోటి అలర్జీలు, గొంతు నొప్పి,  పెదవుల వాపు వంటివి ఏర్పడతాయి. అందుకే బాదం పప్పు లిమిట్ గా తీసుకోవాలి.

బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ  అధిక  పైబర్   శరీరానికి ఇతర ఆహారాల  వల్ల లభించే ఐరన్, జింక్  కాల్షియం వంటి పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు మూలమవుతుంది.

                                                          *నిశ్శబ్ద.