ఈ రోజుల్లో, ప్రజల జీవన విధానం వేగంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం,బిజీ షెడ్యుల్ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా  చుట్టూ ఉన్న చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి  పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం.  అలవాట్లు  జీవనశైలితో పాటు,  ఆహారం కూడా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారంలో సరైన మార్పులు చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా  మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కొన్ని సహజ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

అశ్వగంధ

అశ్వగంధలో చాలా  అద్భుత లక్షణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీనిని సాధారణంగా ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది, ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యేవారు అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోవచ్చు.

బ్రహ్మి లేదా సరస్వతి..

 బ్రహ్మి  మానసిక ఆరోగ్యానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు చికిత్స చేయడంతోపాటు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతమైన మూలిక.  బ్రాహ్మీ టీ తీసుకోవచ్చు.

పసుపు..

అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు , ఎన్నో ఏళ్ళ నుండి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు.  జలుబు, దగ్గు లేదా ఏదైనా గాయం ఇలా ఏదైనా సరే  పసుపు అన్నింటికీ దివ్యౌషధం. వీటన్నింటితో పాటు ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ నివారణ. పసుపు పాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.


తిప్పతీగ..

దీనినే గుడుచి అని కూడా అంటారు. తిప్పతీగ చాలా కాలంగా అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, కరోనా కాలం నుండి  ప్రజాదరణ మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ మూలిక డిప్రెషన్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

తులసి..

హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు తులసి  ఆరోగ్య ప్రయోజనాల వల్ల  కూడా ప్రసిద్ధి చెందింది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది చాలా ప్రభావవంతమైన మూలికలలో ఒకటి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

                                                          *నిశ్శబ్ద.