ఇస్లాం క్యాలండర్ ను అనుసరించి 9 వ నెల రంజాన్ నెలకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లీం సోదరులు.రంజాన్ మాసానికి ప్రాధాన్యత ఏమిటి? ఈ మాసం లోనే పరమ పవిత్రమైన గ్రంధం ఖురాన్ స్వర్గం నుండి అందించిన ట్లుగా భావిస్తారు.ఈ మాసంలో ముస్లీం సోదరులు కటినమైన నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షను చేపడతారు. ఇస్లాం లో రోజా అంటే ఉషోదయం నుంచి సూర్యాస్త సమయం వరకూ ఆహార పానీయాలు తీసుకోకుండా మనో వాంఛలకు దూరంగా ఉండడం రంజాన్ ఉపవాస దీక్షను ఎంతో భక్తి ప్రపత్తులతో పాటిస్తూ ఆయా రంజాన్ ప్రార్ధనలను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు.ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్ష వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కీలక అంశం.
రంజాన్ దీక్ష -ఆరోగ్య ప్రయోజనాలు...
1) శరీరంలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అయి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
2)టాక్సిన్స్ తొలగి పోయి శరీరం లోపల క్లీన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది.
౩) చర్మ సమస్యలు,అర్తరైటిస్, వల్ల ఉపసమనం కలుగుతుంది.
4) వేలు లక్షలు పెట్టి తగ్గించుకున్దామన్న తగ్గని ఊబకాయాన్ని తగ్గించే శక్తి ఉపవాస దీక్షకు ఉంటుంది.
5)ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉన్న మెటబాలిక్ రేటు పెరుగుతుంది.
6)రక్తం లో పి హెచ్ 7.41% ఉండగా అది ఎసిదిక్ అవటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.అయితే ఉపవాసం వల్ల రక్తం శుద్ధి దానంతట అదే చేసుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉంటారు.
7) శరీరం లో కొంత మందికి అధిక లవణాలకారణంగా ఏర్పడిన ఫ్లూయిడ్స్ ను చాలా సులభంగా శరీరం నుండి బయటకు విస్తరించ బడుతుంది.దీనికారణంగా బ్లడ్ ప్రేషర్ నియంత్రించ బడుతుంది.రంజాన్ సందర్భంగా చేసే ప్రధానలలో జీవన శైలి పరమత సహనం మానవ జీవితం లో ఇతరుల పట్ల మానవత విలువల లో సహకారం సహాయం వంటి వి అలవరచుకోవాలని ఖురాన్ బోధనను అనుసరిస్తారు ముస్లిం సోదరులు.
ముఖ్యంగా రంజాన్ నెల ఉపవాస దీక్ష ఒకక్రమశిక్షణ నియమ నిబందనలతో కూడిన ప్రార్ధన అలవాట్లు ఉపవాస దీక్ష విరమణ సమయయం లో సమతుల ఆహారం కూరగాయలు పళ్ళు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అంది ఆరోఫ్యంగా ఉంటారు అటు ఆరోగ్యం క్రమశిక్షణ మార్గం అనుసరించడం వల్ల ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారు. ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్.