అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక
రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా.
పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది.
సిమ్లా మిర్చి...
సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది.
దానిమ్మ పండు..
ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా పనిచేస్తుంది.
అల్లం...
అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది.
పాల కూర...
పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది.
టమాట రసం...
విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది.
యాపిల్...
యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు.
బీన్స్...
బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది.
కమలా పండు... సంత్రా...
విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.