ప్రోటీన్లు మన శరీరానికి బలానికి మాత్రమే కాదు మన జ్ఞాపకశక్తి పెంచడానికి, ఏదైనా శ్రద్ధగా నేర్చుకోపడానికి ఉపయోగపడతాయి. పరిశోధనలో కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఫిజికల్, మెంటల్ యాక్టివిటీస్ రెండూ విభిన్నంగా ఉంటాయి. కానీ.. ఈ రెండు మాత్రం మెటబాలిక్ ప్రోటీన్ పై ఆధారపడి ఉంటాయి. ఇది శరీరంలోని రక్తప్రసరణను, న్యూట్రియన్లను కంట్రోల్ లో ఉంచుతోంది.
మనం శరీరంలో ఉన్న పవర్ ప్లాంట్స్ నుండి మన శరీరానికి, గుండెకు, కండరాలకు కావలసిన శక్తి అందుతుందని రోనాల్డ్ ఇవాన్స్, సాల్క్ జెని డైరెక్టర్ రోనాల్డ్ ఇవాన్స్ అన్నారు. కానీ కండరాలకు, మెదడుకు కావలసిన శక్తి ఈస్ట్రోజన్ - రిలేటడ్ రెస్పెక్టర్ గామా (ఈ.ఆర్.ఆర్) అనే సింగల్ ప్రోటీన్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే ఇవాన్న్ ఈ.ఆర్.ఆర్ గుండె మీద వెన్నెముక కండరాల మీద పనిచేసే విధానం గురించి ఇంతకుముందే పరిశోధనలు చేశారు.
ఇవాన్స్ వారి పరిశోధనల ప్రకారం మెదడులోని హిప్పోకాంపస్ మెదడులో కొత్త బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తి అవడంలో ఉపయోగపడుతుంది. ఇవి మన మెమరిలో భాగమై ఉంటుంది. ఒకవేళ మెదడుపై ఈ.ఆర్.ఆర్ డెైరెక్ట్ గా పనిచేస్తే ఎముకలలో ప్రోటీన్ లేకపోవడం, మనం నేర్చుకోవడంలో చాలా స్లో అయిపోతాం. ఎముకలలో ఈ.ఆర్.ఆర్ కనుక మిస్సయితే వారు మెమరీ విషయంలో కానీ.. నేర్చుకోవల్సిన విషయంలోకానీ.. చాలా నెమ్మదిగా ఉంటారని లైమింగ్ పై అనే పత్రిక తెలిపింది. కనుక మన మెదడుకు, ఎముకలకు కావలసిన ఈ.ఆర్.ఆర్ ఉత్పత్తి కావాలంటే అందుకు కావలసిన ప్రోటీన్స్ తీసుకోవాలి. మన మెమరీ పవర్ ను పెంచుకోవాలి.