ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకొక యాపిల్ తింటే వైద్యుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. అయితే, యాపిల్స్ కాకుండా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే అనేక పండ్లు ఉన్నాయి. పండ్లలో అనేక రకాల పోషక మూలకాలు  ఉంటాయి.  విటమిన్లు మరియు ఖనిజాలు ఒకో పండులో ఒకో విధమైన పోషక విలువలు ఉంటాయి. మెరుగైన పోషక విలువలున్న పండ్ల జాబితాలో దానిమ్మను కూడా ఒకటి. దానిమ్మ తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతేకాదు  ఇది బోలెడు  వ్యాధులకు ఔషదంగా కూడా పనిచేస్తుంది. శారీరక  బలహీనతల తొలగడానికి వైద్యులు దానిమ్మపండును తినమని సిఫార్సు చేస్తారు. దానిమ్మ విటమిన్ సి, బిలకు మంచి మూలం. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం,  జింక్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దానిమ్మ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా  ఉన్నాయి. ఈ లాభ నష్టాలేంటో తెలుసుకుంటే..

దానిమ్మ ఆరోగ్య  ప్రయోజనాలు..

 దానిమ్మ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇతర పండ్ల రసాల కంటే దానిమ్మ రసంలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది  కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, వాపును తగ్గిస్తుంది. దానిమ్మ రసం క్యాన్సర్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దానిమ్మ రసం తీసుకోవాలి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దానిమ్మ గింజలు అల్జీమర్స్ వ్యాధి  పెరుగుదలను నిరోధిస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దానిమ్మ రసం పేగు మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే డయేరియా వ్యాధిగ్రస్తులు దానిమ్మ రసాన్ని తీసుకోవద్దని వైద్యులు  సూచించారు. కీళ్ల నొప్పులు, నొప్పి మరియు ఇతర రకాల ఆర్థరైటిస్ వాపులలో దానిమ్మ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం గుండె జబ్బులకు మేలు చేస్తుంది. గుండె,  ధమనులను వివిధ వ్యాధుల నుండి రక్షించడానికి దానిమ్మ రసం  ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ రసం రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మధుమేహం చికిత్సలో దానిమ్మ రసం త్రాగాలి. దానిమ్మ ఇన్సులిన్‌ను తగ్గించడంలో  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

దానిమ్మ తినడం వల్ల కలిగే నష్టాలు..

దానిమ్మ తొక్క, వేరు లేదా కాండం  అధిక వినియోగం మంచిది కాదు, ఎందుకంటే అందులో విషం ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. తక్కువ రక్తపోటు ఉన్న రోగులు దానిమ్మ రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు దానిమ్మ రసాన్ని తీసుకోకూడదు. చాలామంది చర్మసంరక్షణలో దానిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే  చర్మంపై దానిమ్మ రసాన్ని రాసుకుంటే కొందరికి  దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.

కాబట్టి దానిమ్మరసం లేదా దానిమ్మ గింజలు తినడంలో జాగ్రత్తగా ఉండాలి.

                                                *నిశ్శబ్ద.