మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శారీరంలో వివిధ పనులు చేయడంలో కీలకమైనది. చాలావరకు ఇది గుర్తించబడదు. ఆరోగ్యం బాగుండాలంటే మెగ్నీషియం లోపం లక్షణాలు గుర్తించడం చాలా అవసరం. కడుపులో వికారం, కండరాల తిమ్మిరి నుండి చాలా లక్షణాలు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తాయి. అసలు మెగ్నీషియం లోపం గురించి, ఈ లోపముంటే కనిపించే ఇతర లక్షణాల గురించి తెలుసుకుంటే..
కండరాల తిమ్మిరి..
మెగ్నీషియం కండరాల పనితీరుకు, కండరాల సంకోచ వ్యాకోచాలలకు కీలకమైనది. దీని లోపం వల్ల కనిపించే మొదటి లక్షణం కండరాల తిమ్మిరి. బయటకు వ్యక్తం చెయ్యలేనంత కండరాల బిగుతు, కండరాలు మెలితిప్పినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటే మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
అలసట, బలహీనత..
మెగ్నీషియం శరీరంలో శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల అలసట, బలహీనతకు ఏర్పడతాయి. తరచుగా నీరసంగా అనిపించడం లేదా రోజువారీ పనులు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మెగ్నీషియం లోపం ఉందని అర్థం.
హృదయ స్పందన క్రమబద్దంగా లేకపోవడం..
మెగ్నీషియం స్థిరమైన హృదయ స్పందనకు దోహదం చేస్తుంది. దీని లోపం అరిథ్మియా లేదా హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా మారడానికి దారితీస్తుంది. గుండెదడ లేదా గుండె కొట్టుకోవడంలో అసమానతలు గమనించినట్లయితే ముందుగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
వికారం, ఆకలి లేకపోవడం..
వికారం, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలు మెగ్నీషియం లోపంతో ముడిపడి ఉండవచ్చు. ఈ ఖనిజం జీర్ణవ్యవస్థ సరైన పనితీరులో పాల్గొంటుంది. ఇది లేకపోవడం వల్ల సాధారణ జీర్ణ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. ఎప్పుడూ జీర్ణాశయం అసౌకర్యం ఎదురవుతుంటే మెగ్నీషియం లోపం ఉందని అర్థం.
కాల్షియం స్థాయిలు..
మెగ్నీషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని, నరాల పనితీరును సక్రమంగా ఉంచడానికి కలిసి పనిచేస్తాయి. ఇవి లోపిస్తే కండరాల తిమ్మిరి సంకోచ వ్యాకోచాలలో ఇబ్బంది సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.
*నిశ్శబ్ద.