కోవిడ్ 19 ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో మరణాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యామని లాన్సెట్ రిపోర్ట్ వెల్లడించింది. లాన్సెట్ వెల్లడించిన రిపోర్ట్ ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనాప్రకారం 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారని ఇది జూలై 1-2౦21 నాటి నివేదికలో పేర్కొన్నారు. మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని ప్రజలు ఏమిజరుగుతుందో ఆర్ధం కాక ప్రాణాలు నిలిపులోక పిట్టల్ల రాలిపోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేకపోయారని న్యూ లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫలితాలు వెలువరించింది.

ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని కొన్ని మరణాలు నమోదు చేయలేదని కొన్ని చేర్చలేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో ఎప్పుడైతే విఫలమయ్యామో అభివృద్ధి మరింత కుంటుపడిందని పురోగమనం నుంచి తిరోగమనం వైపుకు చేరామని వివరించింది. ఇందుకు ఉదాహరణగా యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ చాలా దేశాలాలో వారి లక్షాలు కోవిడ్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.నూతన లాన్సెట్ కోవిడ్19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా కష్టం మీద అంగీకరించింది. 

కోవిడ్ 19 సమయం లో ప్రపంచ వ్యాప్తంగా స్పందించిన తీరు ఆశాజనకంగా లేదని కోవిడ్19 విస్తృత వ్యాప్తిని నివారించడంలో విఫలమయ్యామని పారదర్శకత,జాతి దురహంకారం, ప్రధానంగా ప్రాజారోగ్యం ఆచరణాత్మకంగా నిర్వహించడంలో అంతర్జాతీయంగా పరస్పర సాహకరాం సయోధ్య కోరి నందు వల్లే దాని ఫలితంగా 17.7 మిలియన్ల ప్రజలు మరణించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం.

చాలా జాతీయ ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధంగా లేవని ఆయా దేశాలలో స్పందన అంతంత మాత్రంగానే ఉందని బాదితుల పట్ల కనపరాచాల్సిన శ్రద్ధ తూ తూ మంత్రంగా ఉందని తెలుస్తోంది. సమాజం లో వివిద వర్గాలు అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించిందని అందుకు సాక్ష్యంగా కొత్త ఎపిదమాలజికల్ గా,ఆర్ధికంగా,ఆధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని సూచనలు చేసారు.కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడంలో మనకు ఒక గునపాటం గా పేర్కొన్నారు దీర్ఘకాలిక ప్రణాళిక తోనీ సామాజిక ఆరోగ్యాన్ని అందిస్తూ అభివృద్ధి సాగించాలని లాన్సెట్ నివేదికలో పేర్కొంది.