మోతాదుకి మించి యాంటి బయోటిక్స్ వినియోగించిన భారత్...లాన్సేట్ నివేదికలో వెల్లడి.

కోవిడ్ మొదటి రెండవ విడతలో మోతాదుకు మించిన యాంటి బయోటిక్స్ , ఐ సి యు లో మోతాదుకు మించి మత్తు మందులు వినియోగించి నందువల్లె స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర ఇంజక్షన్లు రేమిడి సివిర్ లాంటి ఇంజక్షన్లు ఇష్టారీతిన వాడినందువల్లె బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ వంటి సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడిన కధనాలు మనం చూసాము,చదివాము. 

ఇందులో ఎంతవాస్తవమో మనందరికీ తెలుసు.అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బయోటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటీ మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా తప్పుపట్టారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ డవీయ  విజ్ఞప్తి మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల లిస్టు ను తయారు చేసి ఇస్తామని ఫార్ములాను ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే వెలువడతాయని పేర్కొన్నారు. 

లాన్సేట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదాని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ ఆమోదించినవే అని అందుక ఈ విషయం లో ఆమోదం పొందని అన్న పదం ప్రయోగించడం పై వై కే గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్ స్టడీ రిపోర్ట్  చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సేట్ రేపోర్ట్ ను ఉటంకిస్తూ యాంటి బాయిటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదాని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాలతో పోలిస్తే యాంటి బాయిటిక్స్ వాడకం తక్కువే గానే వినియోగించినట్లు గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయోటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు.

భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4 ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని లాన్సేట్ నివేదిక ప్రకారం దేశంలో యాంటి బయోటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు. యాంటి బాయిటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు.2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని యాంటి బయోటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బయోటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారని వాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు.

ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కిప్షన్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బయోటిక్స్ వినియోగం వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని అత్యవసర సమయాలలో ఎలా వినియోగించారన్నది అంచనా అసాధ్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ సాంపిల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు.ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయా రాష్ట్ర స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు.

యాంటి బయోటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బయోటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయంలో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయంలో గనక యాంటి బయోటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయోటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయోటిక్స్ పనిచేయవని శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తాయని మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని యాంటి బాడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని  నిపుణులు పేర్కొన్నారు. కాగా శరీరతత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బయోటిక్స్ మోతాదును డాక్టర్ సలహా మేరకు వాడాలె తప్ప మరే ఇతర సమాచారం ఆధారంగా యాంటి బయోటిక్స్ వాడరాదని సూచించారు.