అడుస చెట్టు లో ఉన్న వెళ్ళు ఆకులో మంచి ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు ఉనాని వైద్యనిపుణురాలు డాక్టర్ సత్య ప్యాన్ డమిక్ లో అవసరమైన మొక్క అడుస అని అన్నారు. ఉనానిలో ఎన్నో పోషక ఔఫద గుణాలు ఉన్నాయని దాదాపు 6౦౦౦ మొక్కలు ఉన్నాయని వివరించారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో అడుసా ఆరు ఫీట్ల ఎత్తులో పెంచుకోవచ్చు.అడుస మొక్కను కుండీలో 2,3  ఫీట్ల మొక్కగా పెంచుకోవచ్చు.అడుసా ఆకు కషా యం  దగ్గు,జలుబు.ఆయాసంఉన్న వారికి అడుసా  ఆకు కాషాయం బ్రంహాస్త్రం లా పని చేస్తుందని.అసలు దగ్గు వచ్చినప్పుడు వాడే దగ్గు టానిక్ లో ఉండే  రసాయనాలు మనల్ని నిద్రపుచ్చుతాయి.అలా దగ్గు వచ్చినప్పుడల్లా తీసుకుంటే దగ్గు మందు  నరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెదడు మొద్దు బారి పోతుందని డాక్టర్ సత్య వివరించారు. దగ్గు తగ్గుతుంది కాని నరాలలో బలహీనాథ వస్తుంది అది గమనించండి. పిల్లలకు దగ్గు మందు వాడితే చేతులు కాళ్లు వణకడం మొదలు అవుతుంది. ఒక్కో సారి పూర్తిగా ఇంఫెర్టీలిటికి దారి తీస్తుందని డాక్టర్ సత్య హెచ్చరించారు దగ్గు మందు ను పూర్తిగా తగ్గించుకోవాలంటే ఆకు పచ్చగా ఉండే అడుసా ఆకును అంటే బ్రైట్ గ్రీన్ లో ఉండే అడుసా ఆకు బాగా పొడవుగా ఉంటాయి.తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే 1౦ ఆకులు,పిల్లలు అయితే 5 ఆకులు తీసుకుని ఆకులను బాగా కడిగి నీళ్ళలో వేసి బాగా మరిగించి వడకట్టి రోజుకు మూడు కప్పులు అంటే ఉదయం,మధ్యాహ్నం, రాత్రి  అడుసా కషాయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి.

ఇక మహిళలు,అడ పిల్లలు ఎదుర్కునే నెలసరి సమస్య లకు నెలసరి ఎక్కువ లేదా,నెలసరి అసలు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారికి,ఆయాసం,ఉబ్బసం,దగ్గు తో బాధ పడే వారికి,బాగా దగ్గడం వల్ల ఒక్కోసారి వారి ఊపిరితిత్తులు పట్టేసి నట్లుగా ఉంటుంది,అలాగే కొందరిలో పంటి నొప్పి వస్తుంది, అలాంటి వారికి అడుస ఆకు కషాయం తో నోటి దుర్వాసన కూడా పోతుంది.లేదా కొంతమందిలో ముక్కు నుండి రక్తం కారడం చూస్తాం. ముక్కు చీదినప్పుడు అలా రక్తం వస్తే అడుస ఆకు కషాయం  ఉపయోగ పడుతుంది. అడిసను వైద్యంలో వాడతారు.జ్వరం వచ్చినప్పుడు,కోరోనా డెంగ్యు,వైరస్ లు,గొంతు నొప్పి  ఉన్నప్పుడు అడుసా మొక్కను పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు డాక్టర్ సత్య.  అడుసా ను అందుకే సర్వరోగనివారిణి అంటారు.ఉనాని అంటేనే మొక్కలతో వైద్యం,అవగాహన కల్పించే ప్రయతనం చేస్తున్నామని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సంప్ర దాయ వైద్యంలో ఉన్న సులువైన వైద్య విధానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ గి వి సత్య స్పష్టం చేసారు.