ఎండుద్రాక్ష తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడే డ్రై ఫ్రూట్. సాధారణ ద్రాక్షను ఎండబెట్డడం ద్వారా దీర్ఘకాలంగా నిల్వ చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే సాధారణ ద్రాక్ష కంటే ఎండుద్రాక్ష మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ద్రాక్ష ఎండేకొద్ది అందులో పోషకాలు, తీపిదనం పెరుగుతుంది. ఎండుద్రాక్షను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. ఆహార నిపుణులు అయితే మహిళలు ఎండుద్రాక్షను ఖచ్చితంగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎండుద్రాక్ష నీరు తాగుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా నయమవుతాయట. అవేంటో తెలుసుకుంటే..
పోషకాలు..
ఎండుద్రాక్షల ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది కూడా. ఎండుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి ఎండుద్రాక్షను కూడా తినడం కొందరికి అలవాటు.
ప్రయోజనాలు..
ఎండుద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి ఎండుద్రాక్షలను కూడా తింటుంటే శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే విషపదార్థాలు టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఎండుద్రాక్ష నీరు గొప్ప మెడిసిన్. ఈ నీరు స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తిని ఆ నీటిని తాగుతుంటే సులువుగా బరువు తగ్గుతారు.
ఎండుద్రాక్ష నీటిలో నానిన తరువాత అందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఏర్పడుతుంది. ఈ నీటిని ఉదయాన్నే తాగి ఆ నానిన ఎండుద్రాక్షలు కూడా తింటుంటే జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.
ఎండుద్రాక్ష డ్రై ఫ్రూట్ గా పరిగణించబడుతుంది. ఇందులో సాధారణ ద్రాక్ష కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగుతున్నా, నానిన ఎండుద్రాక్ష తింటున్నా రోజంతా శరీరం చురుగ్గా ఉంటుంది. శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. చాలా రకాల ఆహారాలను అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్ష నీరు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండుద్రాక్ష నీటిని ఉదయాన్నే తాగడం చాలా మంచిది. ఒకవేళ ఆ సయమంలో తాగలేక పోతే.. ఉదయం టిఫిన్ సమయంలో లేదా.. సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా తాగవచ్చు. కనీసం 15 నుండి నెల రోజులు దీన్ని క్రమం తప్పకుండా ఫాల్లో అవుతుంటే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
*రూపశ్రీ.