భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే..


మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు.


ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.


రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

 మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు.

మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

                                                 *నిశ్శబ్ద.