భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు. తమలపాకు  చరిత్ర చూస్తే  సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తమలపాకు ఉనికిలో ఉంది. హృదయం  ఆకారంలో ఉండే ఈ ఆకు పురాణాలలోనూ,  మత గ్రంథాలలోనూ  కనిపిస్తుంది. తమలపాకులతో  అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.  తమలపాకు జ్యూస్  తాగితే ఎన్నో లాభాలు పొందొచ్చు. అవేంటో తెలుసుకుంటే..

తమలపాకు ప్రయోజనాలు..

జ్వరం, జలుబు, ఛాతీ రద్దీ,  శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడానికి తమలపాకులను పురాతన కాలంలో ఉపయోగించారు. శ్వాస సమస్యలు ఉన్నవారు తమలపాకులతో పాటు లవంగాలను నీళ్లలో వేసి బాగా మరిగించి తాగాలి. దీని వల్ల  చాలా వరకు ఉపశమనం పొందుతారు.

గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఈ ఆకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని తాగడం వల్ల గుండె జబ్బులకు చాలా మేలు జరుగుతుంది. తమలపాకును తినడానికి ఇష్టపడే వారు సాధారణ తమలపాకులను తినాలి,  తీపి ఆకులను తినకూడదు. ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.

తమలపాకుల జ్యూస్  జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. దీంతో ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. సాంప్రదాయకంగా తమలపాకులను భోజనం తర్వాత తీసుకుంటారు. ఇది మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే కాకుండా ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. తమలపాకులో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా కావిటీస్,  చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యలను నివారిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తమలపాకులలో ఉంటాయి.  ఇది కీళ్ల నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.

                                                *నిశ్శబ్ద.