మీకు టైప్ 2డయాబెటిస్ ఉందా అయితే మీకు పార్కిన్ సన్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
లండన్ కు చెందిన క్వీన్ మేరీ విశ్వ విద్యాలయం చేసిన పరిశోధనలో టైపు 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికీ పార్కిన్ సన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ పరిశోదన వల్ల పార్కిన్ సన్స్ త్వరగా విస్తరిస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఒక వేళ పార్కిన్ సన్స్ ఉంటే ఇంకా తీవ్రంగా ఉంటుందని వైద్యులు తమ పరిశోదనలో వివరించారు.

ఈ పరిశోధనకు శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. టైపు 2 డయాబెటిస్ మందులు వాడుతుంటే వారిలో కొంచం పార్కిన్ సన్స్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తేల్చారు. పార్కిన్ సన్స్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. చికిత్స తీసుకోవాలని సూచించారు. గతంలో జరిపిన రివ్యూ లో మెటామాలిసిస్  ఉత్పత్తి  డయాబెటిస్  పార్కిన్  సన్స్ మధ్యఉన్న సంబంధం గురించి తెలుసుకోగలిగామని నూతన పరిశోదనలో మూవ్మెంట్ డిజార్దర్స్ జర్నల్ లో ఈ అంశం ప్రచురించారు. మెటా ఎనాలసిస్  దాటా ద్వారా వీటిని పరిశీలించినట్లు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పార్కిన్ సన్స్ ప్రభావం పై పూర్తిగా మూల్యాంకనం చేస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు . ఈ అంశం పై క్వీన్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ అల్సతార్ మాట్లాడుతూ ఈ పరిశోదనవల్ల మరిన్ని అంశాలు వెలుగు  చూసాయని అన్నారు. డయాబెటిస్ కేవలం పార్కిన్ సన్స్ మాత్రమే ప్రభావం చూపదని పార్కిన్ సన్స్ వృద్ధి చెందకుండా అందుకు అవసరమైన చికిత్సలు పార్కిన్ సన్స్ నివారణ చికిత్సలు సూచించామని ఆయన అన్నారు.