సాధారణంగా బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. అందుకు వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా చాలా మార్పులు అవసరం. చాలామంది జిమ్‌లో గంటల తరబడి ఎక్సర్ సైజులు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. పోషకాహార నిపుణులు బరువు తగ్గడానికి సులభమైన మార్గాన్ని సూచించారు. ఇలా చేయడం వల్ల కేవలం 7 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా డైట్ పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే బెల్లిఫ్యాట్ తగ్గించుకునేందుకు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలుసుకుందాం.
డిటాక్స్ ఆహారం:
బరువు తగ్గడానికి వివిధ రకాల ఆహారాలు ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గడానికి డిటాక్స్ డైట్ కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి ఆహారాలు చాలా హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులుగా, టాక్సిన్స్ తొలగించడానికి మీరు ఈ మూడు పనులు చేయడం ముఖ్యమని చెప్పారు. ఆ మూడు పనులు ఏమిటో చూద్దాం.
ప్రతిరోజూ 3 పనులు చేయండి:
-జీలకర్ర పుదీనా డిటాక్స్ నీటిని ఖాళీ కడుపుతో త్రాగండి.
-అల్పాహారం కోసం దోసకాయ స్మూతీని తీసుకోండి.
-మధ్యాహ్నం, రాత్రి భోజనం మధ్య చియా గింజల నీటిని త్రాగాలి.
డిటాక్స్ డైట్ ప్రతికూలతలు:
డిటాక్స్ ఆహారం తరచుగా శరీరంలో ఆకలి, అలసటను కలిగిస్తుంది. బలహీనత కనిపించవచ్చు. ఇది తక్కువ శక్తి, తక్కువ రక్త చక్కెర, అలసట, తల తిరగడం, చేయి నొప్పులను కలిగిస్తుంది. అదే సమయంలో, ఇటువంటి బరువు తగ్గించే ఆహారాలు కూడా చాలా బోరింగ్. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనితో పాటు, తాజా పండ్లు, కూరగాయలు తినడం, కొంత వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.