ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీ బిజీ గా గడిపేవారు ఇప్పట్లో చాలామంది ఉన్నారు. నిమిషం తీరిక లేకుండా ఉంటారంటూ నలుగురూ ఇలాంటి వాళ్లను తెగ పొగిడేస్తుంటారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చక్కని ప్లానింగ్ తో ఉంటామంటూ ఇలాంటి వారు తమని తాము చూసుకుని సంతోష పడుతుంటారు. మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. వీరికి వాగుడూకాయ్ అనే బిరుదు కూడా ఇచ్చేసి ఉంటారు చుట్టూ ఉన్నవారు. కానీ రోజులో కనీసం ఒక్క గంటసేపు సైలెంట్ గా ఉండమని వైద్యులు చెబుతున్నారు. సైలెంట్ గా అంటే ఏ పని చేయకుండా అని కాదు, పనులు మాత్రమే కాకుండా అస్సలు వాగకుండా మౌనంగా ఉండటం. ఈ వేగవంతమైన కాలంలో ప్రతి రోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయట. ఇలా సైలెంట్ గా ఉండటం వల్ల కలిగే 6 పెద్ద ప్రయోజనాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..
రోజులో ఉన్న 24గంటల్లో 1 గంటసేపు ఖచ్చితంగా మౌనాన్ని పాటిస్తూ ఉంటే మానసిక రుగ్మతలు అన్నీ మంత్రించినట్టు మాయమైపోతాయట. శరీరంలో ఒత్తిడి హార్మోన్లు త్కకువగా ఉత్పత్తి కావడానికి సైలెంట్ గా ఉండే ఈ గంట సమయం చాలా సహాయం చేస్తుంది. ఫలితంగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇదే మానసిక సమస్యలు మెల్లగా తగ్గేలా చేస్తుంది.
ఎవ్వరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు సహజంగానే తమ గురించి తాము ఆలోచించుకోగలుగుతారు. సెల్ఫ్ చెక్, సెల్ప్ టాక్ అనేది భావోద్వేగాలతో అనుసంధానం కావడం, తప్పొప్పులను బేరీజు వేసుకోవడం, జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవడం. సరైన దారిలో ప్రయాణించడానికి తోడ్పడుతుంది.
ప్రస్తుతకాలంలో చాలామంది నిద్ర విషయంలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. పక్క మీదకు వాలినా నిద్రరాకపోవడం, కలత నిద్ర, నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడం వంటి సమస్యలన్నీ కేవలం రోజులో గంట సేపు మౌనంగా ఉండటం వల్ల పరిష్కారమవుతాయి. గంట సేపు మౌనంగా ఉండటం వల్ల కలిగే మానసికంగా కలిగే మార్పులు మంచి నిద్రను ప్రేరేపిస్తాయి. ఫలితంగా రాత్రి సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా నిద్రపోతారు.
చిన్న వయసులోనే రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. కానీ రోజూ గంట సేపు మౌనంగా ఉంటే ఎంత రక్తపోటు అయినా మంత్రించినట్టు అదుపులోకి వస్తుంది. అధిక రక్తపోటు వల్ల సహజంగానే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ప్రతిరోడూ గంటసేపు మౌనంగా ఉంటూ ఉంటే ఈ ప్రమాదాలన్నీ అస్సలు దరిచేరవు.
తక్కువగా మాట్లాడటం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ శరీరంలో రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి అనారోగ్యంతో అయినా పోరాడగలిగే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. కాబట్టి రోజులో గంటసేపు మౌనంగా ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టే.
ఎప్పుడూ లొడలొడా వాగుతుండేవారి మాటలకు అడ్డూ అదుపు ఉండదు. పరిస్థితులు, సందర్బాలతో ప్రమేయం లేకుండా నోటి మాటలు అలా వచ్చేస్తుంటాయి. కొన్ని సార్లు ఎదుటివారి పరిస్థితిని కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తారు చాలామంది. కానీ ప్రతిరోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల మాటను అదుపులో పెట్టుకోగలుగుతారు. మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడగలుగుతారు. ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం, ఎదుటివారు చెప్పేది పూర్తీగా వినే ఓపిక, దానికి సరైన సమాధానం ఇచ్చే నేర్పు అన్నీ అలవడుతాయి. కేవలం రోజులో ఒక్క గంటసేపు మౌనంగా ఉండటం వల్ల పైన చెప్పుకున్న లాభాలు కలిగి జీవితాన్నే మార్చేస్తాయి.
*నిశ్శబ్ద.