ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట. కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే..
రోగనిరోధక శక్తి..
కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు కివి పండు నుండే పొందవచ్చు. విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పొటాషియం మెండు..
గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది. కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది.
రక్తం గడ్డకట్టే పనికి చెక్..
సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
*నిశ్శబ్ద.