ఇప్పట్లో ఆఫీసులు, ఇళ్లు అన్నీ బిల్డింగ్ లలోనే ఉంటున్నాయి. ఈ కారణంగా లిఫ్ట్ లు తప్పనిసరిగా వాడుతుంటారు. లిఫ్ట్ సౌకర్యం ఉందిగా.. మళ్ళీ మెట్లు ఎక్కి ఎందుకు శ్రమ పడాలి?? అనుకుంటారు ఎక్కువ శాతం మంది. అయితే ఆఫీసుల్లో గంటల కొద్ది కూర్చుని చేసే ఉద్యోగం, ఆ తరువాత ఇళ్ళల్లో కూడా మరీ శారీరక శ్రమ ఏమీ లేకుండా సింపుల్ గా పనులు జరిగిపోయే మార్గాలు ఉండటంతో శారీరక శ్రమ తక్కువగానే ఉంటుంది. అయితే ఇలా బిల్డింగ్ లలో లిఫ్ట్ లో వెళ్ళడం మానేసి మెట్లు ఎక్కితే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా??
లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఉపయోగిస్తే..
రోజువారీ పనుల్లో వేగం కారణంగా లిఫ్ట్ ఎక్కువగా వాడుతారు. ఇది సమయాన్ని సేవ్ చేస్తుంది. కానీ ఈ అలవాటు మానుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. రొటీన్‌లో ఈ చిన్న మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక మెట్లు ఎక్కడం వల్ల సాధారణంగా నాలుగు అడుగులు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి అయ్యి కేలరీలు దీనివల్ల ఖర్చు అవుతాయి. రోజూ కనీసం 50 మెట్లు ఎక్కితే 2000 అడుగులు నడిచినంత ఫలితం చేకూరుతుంది.
ఇప్పట్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి ఫిట్నెస్ తక్కువగానే ఉంటోంది . ఇలాంటి వాళ్లకు లైఫ్ స్టైల్ లో భాగమైన ఆఫీసులు, అపార్ట్మెంట్లకు వెళ్ళడం అనేది మంచి అనువైన మార్గం. వ శారీరక దుష్ప్రభావాలను తగ్గించడంలో క్యాలరీలను బర్న్ చేయడంలో మెట్లు ఎక్కే ప్రక్రియ చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
మెట్ల ఎక్కడం అనేది గుండె మరియు శ్వాసకోశ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అద్భుతమైన వ్యాయామం. మెట్లు ఎక్కేటప్పుడు ఫాలో అయ్యే విధానం కూడా దానికి తగిన ఫలితాలను ఇస్తుంది. మెట్లపై నడవడం కంటే జాగింగ్ లాగా నెమ్మదిగా పరుగెడుతున్నట్టు వెళితే అదొక మంచి ఏరోబిక్ వ్యాయామంలా కూడా పనిచేస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి.
రొటీన్ లైఫ్ స్టైల్ లో ఈ ఒక్క మార్పు చేసుకుంటే చాలు.. చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవడం వల్ల, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరం మీద కలిగే దుష్ప్రభావాలు తగ్గడమే కాకుండా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొన్ని ఆసక్తికర విషయాలు..
రోజుకు 55 కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని, మరణ రేటును తగ్గిస్తుంది.
నిమిషం పాటు నాన్ స్టాప్ గా మెట్లు ఎక్కితే.. 8-11 కిలో కేలరీలు బర్న్ అవుతాయి, ఇది ఇతర శారీరక శ్రమతో పోలిస్తే చాలా ఎక్కువ.
మెట్లు ఎక్కేవారు సాధారణ వ్యాయామం చేసేవారికంటే మరింత ఫిట్‌గా ఉంటారు. ఏరోబిక్ సామర్థ్యం పెరుగుతుంది.
రోజుకు 20 మెట్లు ఎక్కినా చాలా సులువుగా ఏడాదికి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.
రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఎముకలు బలంగా మారడానికి ఇది సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
ఎముకలు, కండరాలు మరియు కీళ్ల ఆరోగ్యానికి మెట్లు ఎక్కడమనే ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది.
కాబట్టి ఈరోజు నుండే మీ లిఫ్ట్ బటన్ నుండి దూరం జరిగి మెట్లు ఎక్కడాన్ని ఎంజాయ్ చేయండి..
*నిశ్శబ్ద.