గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.  చాలామంది గ్రీన్ టీని ఉదయం సమయంలో తాగుతారు,  లేదా సాయంత్రం సమయంలో తాగుతారు. కానీ గ్రీన్ టీని రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత తాగినా చాలామంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు కొందరు.  అసలు గ్రీన్ టీ ని రాత్రి సమయంలో తాగవచ్చా?  రాత్రి సమయంలో తాగాలి అనుకుంటే ఎన్ని గంటలకు తాగాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? తెలుసుకుంటే..

రాత్రి సమయంలో గ్రీన్ టీ..

రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం గురించి ఒక సమాచారం చాలా వైరల్ అవుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది మళ్లీ ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు.  ఏవో ఒక స్నాక్స్ లేదా పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ రాత్రి సమయంలో బోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే పెద్ద పెద్ద ఆరోగ్య మార్పులు చేయకపోయినా.. చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు.

స్వీట్ క్రేవింగ్స్..

రాత్రి సమయంలో బోజనం తర్వాత కొందరికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. డిన్నర్ చేసిన తర్వాత  తీపిగా ఉన్న పదార్థాలు ఏమైనా తినాలని అనుకుంటారు. ఇందుకోసం ఇంట్లో చిరుతిళ్లు,  ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్టాక్ పెట్టుకుని ఉంటారు. కానీ రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఈ స్వీట్ క్రేవింగ్స్ కు చెక్ పెడుతుంది.  భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఆ తరువాత మళ్లీ స్వీట్స్ ఏమీ తినాలని అనిపించకపోవడమే దీనికి కారణం.

రిలాక్స్..

భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మానసికంగా రిలాక్స్ గా ఉంచుతుందట. ఇది పదే పదే ఫోన్ చూడటం లేదా స్క్రీన్ టైమ్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతుందట. నిద్ర సమయానికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తుందని అంటున్నారు.

తక్కువ భోజనం..

రాత్రి సమయంలో డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు భోజనం తక్కువ తీసుకోవడానికి సహాయపడుతుందట. రాత్రి తేలిక పాటి బోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగాలనే కారణంతో భోజనం తక్కువ తీసుకోవడం జరుగుతుందట.

రాత్రి గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..

రాత్రి సమయంలో గ్రీన్ టీని రాత్రి భోజనం చేసిన  అరగంట తర్వాత తీసుకోవచ్చు.

రాత్రి గ్రీన్ టీ తాగితే నష్టం..

రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల కొందరికి నిద్ర పట్టడంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది రాత్రి భోజనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల మధ్య భోజనం ముగిస్తే 8నుండి 8.30 లోపు గ్రీన్ టీ తాగవచ్చు.  రాత్రి 10గంటలకు చక్కగా నిద్రపోవచ్చు. అలా కాకుండా రాత్రి బోజనం ఆలస్యంగా 10 గంటలకు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో చేసి ఆ తర్వాత గ్రీన్ టీ తాగితే అది నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.

                                      *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...