వైరస్ ఇక మనుషుల నుంచి కాక జంతువుల నుంచి వచ్చే అవకాశం ఉందా?
ప్రస్తుతం శాస్త్రజ్ఞులను వేదిస్తున్న పెద్ద సమస్య. వైరస్ లు ఇక జంతువుల నుండి వచ్చే అవకాశాని
కొట్టి పారేయలేము అని అన్న కొద్దిరోజులకే కేరళలో ఆంత్రాక్స్ కలకలం ప్రజలలో తీవ్ర ఆందోళనకు
కారణమౌతోంది. ఆంత్రాక్స్ ఒకప్పుడు ఆ పేరు వింటేనే మనకు నరకం, ప్రాణం పోయినంత పని అయ్యేది. గతంలో మన ఇంటికి వచ్చే పార్సిల్స్ లో ఆంత్రాక్స్ పొడిని పంపి నట్లు తెలిపెవారు. ఆరకంగా ఆంత్రాక్స్ కు భయపడే వారు ఆంత్రాక్స్ తో చనిపోతా మేమో అని ఆందోళనకు గురియ్యే వారు. ఆరకంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఆంత్రాక్స్ ఇప్పుడు కేరళలో వెలుగు చూసిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
తిరువనంతపురం లో ఇటీవల అధికసంఖ్యలో అడివి పందులు మరణించాయని కేరళ లోని అతిరా పిల్లి అటవీ ప్రాంతం లో కొన్ని రోజులుగా ఇలా జరుగుతోందని, దీనికి కారణం ఆంత్రాక్స్ సోకడమే అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కేరళా ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ అడవి పందులలో ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతిరా పిల్లి అటవి ప్రాంతం లో పెద్ద సంఖ్యలో జంతువులు మరణించడం తీవ్ర ఆందోళనకలిగిస్తోందని.ఈమేరకు అధికారులు అటవీ ప్రాంతం లో సేకరించిన నమూనాల ఆధారంగా ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ గా తేల్చారు అని జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంత్రాక్స్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆంత్రాక్స్ బ్యాక్టీరియా సహజంగానే భూమిలో ఉంటుందని పెంపుడు జంతువులు, అటవీ ప్రాంతం లో ఉండే జంతువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంత్రాక్స్ అంటే ఏమిటి?
ఆంత్రాక్స్ చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి. గ్రామ్ పోజిటివ్ అనే బ్యాక్టీరియా దీనికి కారణం అవుతుంది. దీనిని బెసిలిన్ అంత్రాసిస్ అని అంటారు. సహజంగా ప్రకృతిలో ఉండడం వల్ల పెంపుడు జంతువులలో వస్తుంది.ఆంత్రాక్స్ వల్ల జంతువులు చనిపోతాయి. ఆంత్రాక్స్ వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతారు.ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉత్పత్తులు ద్వారా ఆంత్రాక్స్ సంక్రమించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో జీవించే జంతువులలో మనుషులు వ్యాపరద్రుక్పదం తో పెంచే జంతువులు ఆవులు, గొర్రెలు నివసించే ప్రాంతాలలో ఆంత్రాక్స్ సోకే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంత్రాక్స్ లక్షణాలు ఎలాగుర్తించాలి...
ఆంత్రాక్స్ సోకిన జంతువులు అక్కడి కక్కడే చనిపోతాయి.జంతులు చనిపోడానికి ముందు తీవ్రమైన జ్వరం,ముక్కు నోటి నుండి రక్తం కారడం వంటి లక్షణాలు ఉంటాయి . అయితే ఈ లక్షణాలు చాలా జంతువులలో కనపడక పోవచ్చు. పెద్ద సంఖ్యలో జంతువులు చనిపోతున్నప్పుడు అది ఆంత్రాక్స్ గా గుర్తించక పోవడం వల్ల చనిపోవడం గమనించవచ్చు నని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంత్రాక్స్ కు అసలు కారణం పూర్తిగా తెలియరాలేదని పెద్దసంఖ్యలో ఆంత్రాక్స్ మహమ్మారి సోకినప్పుడు ఆంత్రాక్స్ నివారణ పూర్తిగా కష్ట సాధ్య మౌతుంది. అధికసంఖ్యలో జంతువులు మరణించినప్పుడు ముఖ్యంగా ఆవులు,గేదెలు,గొర్రెలకు ముందే ఆంత్రాక్స్ పరీక్షలు నిర్వహించి ఉంటె చనిపోయి ఉండేవి కాదనేది నిపుణుల వాదన. అయితే మానవులకు ఆంత్రాక్స్ సోకకుండా నివారించడం అవసరం.
ప్రజలకు ప్రమాదం ఉంటుందా?
ఆంత్రాక్స్ వల్ల పెద్దమొత్తం లో చనిపోయిన దాఖలాలు లేవని నిపుణులు అంటున్నారు.ఎవరైతే రైతులు చనిపోయిన జంతువుల కళేబరాలు తీస్తారో గోడల చావిళ్ళు,లేదా గొర్రెలు పెంచే షెడ్లలోఉండే వారు లేదా పని చేసే వారికి వ్యాధి సోకిన జంతువునుండి ఇన్ఫెక్షన్ సోకవచ్చు లేదా మనకు తెలియకుండా ఆంత్రాక్స్ సోకిన జంతువుల మాంసం తీసుకున్నా ఆంత్రాక్స్ బారిన పడవచ్చునని నిపుణులు అంటున్నారు. 2౦౦7 లో తొలి సారి ఆంత్రాక్స్ వెలుగు చూసింది అప్పుడు చర్మం ఇన్ఫెక్షన్ కు గురియ్యింది. దానినుండి యాంటి బాయిటిక్స్ తో కోలుకోవచ్చు.
ఆంత్రాక్స్ రాకుండా చేపట్టాల్సిన చర్యలు...
*వ్యాధి విస్తరణ నిరోదించాలి.
*పెంపుడు జంతువులు ఆంత్రాక్స్ రాకుండా జాగ్రత పడాలి.
*లైవ్ స్టాక్స్ ఉత్పత్తులు ఎగుమతులు మార్కెట్లకు చేరకుండా జాగ్రత పడాలి.
*ఆంత్రాక్స్ విస్తరించకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి.
*అత్యవర చికిత్సా విభాగాలు ముఖ్యంగా మొబైల్ వేటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలి.