ప్రపంచం లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం ప్రమాద ఘంటికలు మొగిస్తోందని వాతావరణం ప్రభావం అంశం పై శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో వివిధరకాల వాతావరణాలు, వాతావరణ కాలుష్యం వల్ల కొన్నిరకాల గుండె శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తేల్చారు. వాతావరణం లో పేరుకు పోయిన కొన్నిరకాల అణువులు పార్టికల్స్, రసాయనాల ప్రభావం తో ఊపిరి తిత్తులలో అస్తమా
వంటి సమస్యలు మానవులను చుట్టుముడుతున్నాయని అవి ప్రాణాలను హరిస్తున్నాయని ఒక ఆధ్యయనం లో వెల్లడించారు. ప్రపంచం లో పెరుగుతున్న పట్టణీకరణ,పారిశ్రామికీకరణ ఆధునికత పేరుతో మనకు మనం గా ప్రకృతిని నాశనం చేస్తూ సృష్టిస్తున్న రసాయన వ్యర్ధాలు వివిదరకాల ఉద్ఘారాల వల్ల వాతావరణం లో మార్పులు రేడియేషన్ వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతోంది అని నిపులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, సైతం రసాయనాల చేరికతో కాలుష్యం తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచం లో వెలుస్తున్న గ్రీన్ హౌస్ లు సాంకేతికత వృద్ధిలోభాగంగా పుట్టుకొస్తున్న ఉద్గారాల వల్ల భూమిపై రేడియేషన్ పెరిగి వివిద రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
--మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది అనడం లో సందేహం లేదు. ఒక పరిశోదనలో కొన్ని ప్రాంతాలలో లేదా ప్రత్యేక ప్రాంతాలలోనివసిస్తున్న వారి ఆనారోగ్యం పాలవుతున్నారని. తద్వారా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. ---ఇందులో కొన్ని కారణాలను కారకాలను పేర్కొన్నారు.గాలి కాలుష్యం,ఇంధనం ఎక్కువగా వినియోగించడం వల్ల వచ్చే పొగల ప్రభావం గుండె సంబంధిత సమస్యలు మరణాల సంఖ్యకు కారణం అవుతోందని నూతన పరిశోదన వెల్లడించింది. శాస్త్రజ్ఞులు చేస్తున్న వాదన లలో మన వాతావరణం లో వస్తున్న మార్పులు కాలుష్యం వల్లే మన ఆరోగ్యం పెను ప్రమాదం లో పడిందని మరణాలకు దారి తీస్తుందని పరిశోదన వెల్లడించింది.
మరణాలకు కారణాల పై అధ్యయనం...
చాలా ప్రాంతాలలో శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు ప్రజలకు ప్రమాదకర మైన,,రేణువులు,గాలిలో ఉండడం,రసాయనాలు, ఇతర కారకాలు ప్రమాద కరం గా మరాయని మరణాలకు గల కారణాలను అధ్యయనం తెలిపింది .గుండె సంబందిత సమస్యల వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల జరిపిన ప్లాన్ వన్ వాతావరణ కాలుష్య కారకాలు మరణాలు కేవలం గుండె సంబంధిత మరణాల పై పరిశోదనలు చేయడం విశేషం. పరిశోధకులు గుండే సంబందిత మరణాలకు చాలానే కారణాలు ఉన్నాయని గాలి ఇంటిలో కాలుష్యం కూడా కారకంగా తేల్చారు.
ఆరోగ్యం పై వాతావరణ ప్రభావం...
చాలా రకాల కారకాలు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని ఉదాహరణకు జనటిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని.కొన్నిరకాల డిజార్డర్స్ లేదా వ్యాధులకు దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ ప్రజలు వారి వ్యవహార శైలి వ్యాధులకు కారణం ఔతోందని వాతావరణం ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. డబ్ల్యు హెచ్ ఓ లెఖల ప్రకారం 24%మరణాలు కేవలం వాతావరణం కారణమని నిర్ధారించారు. డబ్ల్యు హెచ్ ఓ కొన్నిరకాల వాతావరణ వాస్తవాలు మరణాలకు దోహదం చేశాయని ఈకింద పేర్కొన్న అంశాలు ఉన్నాయని విశ్లేషించారు.
*గాలి కాలుష్యం.
*నీటి కాలుష్యం.
*అపరిశుభ్రత.
*హానికారక రసాయనాలు.
*తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రభావం ఎండవేడిమి పెరగడం,అత్యధిక శీతల వాతావరణం తో తీవ్ర సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అని నిపుణులు తేల్చారు.
గాలి కాలుష్యం...
గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరం.అని అది ఊపిరి తిత్తులను గుండెను ప్రభావితం చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.గాలిలో ఉండే రేణువులు శరీరంలో నుండి వ్యక్తి లోకి చేరి వారిలో మెదడు సంబంధిత సమస్యలకు కారణం అవుతోందని నిపుణులు నిర్ధారించారు.
మెదడులో ఫ్లూయిడ్స్ గుర్తింపు...
ఒక పరిశోదనలో కాలుష్యపు అణువులను మెదడులో ఉన్న ఫ్లూయిడ్స్ లో గుర్తించినట్లు దీనికారణం గానే బ్రెయిన్ డిజార్డర్స్ కు కారణంఅవుతున్నట్లు నిపుణులు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఎలుకల పై చేసిన పరిశోదనలో కాలుష్యపు రేణువులు మానవుల ఊపిరి తిత్తుల నుండి రక్తం లోకి చేరుతుందని ఆకారణం గా మెదడులో రక్త ప్రవాహం లో ఏదైనా సమస్య తల ఎత్తి ఉండవచ్చు అని నిపుణులు తేల్చారు.గాలి కాలుష్యం కారణంగానే ఊపిరితిత్తులు గుండె సమస్యలకు కారణమని నిర్ధారించారు.
నష్ట నివారణ సాధ్యమా ?
నష్ట నివారణ సాధ్య మేనా -అన్నది ఒక పెద్ద ప్రశ్న కాలుష్య నివారణ సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. బెర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చైనా సంస్థలు చేసిన పరిశోదనలో వాతావరణ కాలుష్యం నుండి వచ్చిన టో క్సిన్స్ రేణువులు మెదడుకు చేరతాయని కనుగొన్నారు. 25 మంది ప్రజల పై చేసిన పరిశోదనలో సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ను పరీక్షించగా రకరకాల మానసిక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అందులోనూ రకరకాల టాక్సిక్స్ ఉన్నట్లు సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ౩2% రోగుల రక్తం లో ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్నవారి వద్ద నుండి 26 రక్త్గం నమూనాలు సేకరించినట్లు ఒక వ్యక్తిలో కొన్ని రకాల టో క్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించి నట్లు తెలిపారు. పరిశోదనలు చేసిన బర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇసెల్ట్ లిగ్నిచ్ మాట్లాడుతూ మా పరిశోదనా జ్ఞానం వాతావరణం లో పుట్టుకొచ్చే ప్రామదకరమైన కాలుష్య ప్రభావం వల్ల గాలిద్వారా వ్యాపించే ఇతర రేణువులు పార్టికల్స్ ముఖ్యంగా మెదడు నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించడం వల్లే మెదడు పని తీరు బలహీన పడి శ్వాస సంబందిత సమస్యలు శరీరాన్ని చుట్టుముట్టి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు.
వాతావరణ కాలుష్యం ప్రధాన అంశం...
పి ఎం 1౦ పార్టికల్స్ 1౦ మైక్రోన్స్ ఇందులో గాలి ద్వారా వైరస్ బ్యాక్టీరియా, పొగ, ఇతర దుమ్ము ధూళి వంటి కారకాలు ఉండవచ్చు. --పి ఎం 2.5 లో కొన్నిరకాల పార్టికల్స్ 2.5 మైక్రాన్ల లో విద్యుత్ ఉత్పదక కేంద్రాల నుండి వెలువడే ధూళి,పొగలు వాహనాల నుండి వెలువడే పొగ ఇతర రసాయనాలు ఉన్నాయని తేల్చారు. ౦.1 పార్టికల్స్ వంటివి మానవుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని అది శరీరంలో వీటిని ఎదుర్కొనే శక్తి అంతర్గత బద్రత లేదా ఇతర ఫారెన్ బాడీలు రోగనిరోదక శక్తి చాలా బలహీన మౌతోంది. ఇటీవల జరిగిన పరిశోదనలో సైతం ౦.1 మైక్రన్స్ రేణువులు అక్సిడెంట్స్ ఒత్తిడి ,గుండె సంబంధిత టాక్సీటీ కి కారణంగా తేల్చారు. రానున్న భవిష్యత్తులో ఎదురయ్యే కాలుష్య సమస్యలను ఎదుర్కోడానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఇప్పటినుండే నిర్దిష్ట ప్రణాళికల అమలుకు ప్రతిఒక్కరు సిద్దం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి-అటు ప్రజలు-స్వచ్చంద సంస్థలు ఉద్యమ స్పూర్తితో ప్రయత్నం చేస్తే తప్ప కాలుష్య రహిత ప్రపంచాన్ని సృష్టించాలేమని పేర్కొన్నారు. కాలుష్య రహిత ప్రపంచానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి శాస్త్రజ్ఞుల పిలుపు.