నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి దశ.  నిద్రలో ఉన్నప్పుడు  శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి.  అయితే కొందరు నిద్రపోతున్నప్పుడు శరీరంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. కాళ్లు పట్టేయడం, శ్వాస ఆడటంలో ఇబ్బంది,  ఒళ్లు లాగడం.. ఇలా చాలా సమస్యలు ఉంటాయి.  అయితే కొందరికి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా  చేతుల్లో  జలధరింపు వస్తుంటుంది.  ఇలా జరిగితే కొన్ని వ్యాధులు ఉన్నట్టు సంకేతం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.


మెదడులో రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు రక్తం గడ్డకడుతుంది.  దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.  ఈ సమస్య ఎదుర్కుంటున్న వ్యక్తులలో నిద్రపోతున్న సమయంలో చేతులలో జలధరింపు వస్తుంది. అంటే చేతులలో జలధరింపు ఉన్న వ్యక్తులలో స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది.


రాత్రి నిద్రపోతున్నప్పుడు చేతులు జలధరింపుకు గురవుతూ ఉంటే అది గుండెపోటుకు సంకేతం అని అంటున్నారు.  ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం,  మైకంగా ఉండటం వంటి సమస్యల వల్ల వస్తుంది.


శరీరంలో విటమిన్-బి12 లోపం ఏర్పడినప్పుడు కూడా ఇలా నిద్రలో చేతులు జధరింపుకు గురవుతాయి.  కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది.


రెగ్యులర్ గా రాత్రి సమయంలో మందులు వేసుకునే వారిలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.  మందుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.


రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, మధుమేహం  పెరిగినా రాత్రి పూట నిద్రలో చేతులు జలధరింపుకు  లోనవుతాయట. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనప్పుడు ఇది జరుగుతుంది.


                                                  *రూపశ్రీ.