చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది. క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం.
ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు..
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం, భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి.
గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే..
ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు.
అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే..
నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది.
కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు..
ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.
*నిశ్శబ్ద.