కాలుష్యం మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని పర్యావరణ వేత్తలు మనల్నిఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజు ట్రాఫిక్ లో తిరిగే వారికి కళ్ళకి సంబంధించిన ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ వుంటుందట. చాలా సార్లు కళ్ళు దురదలు రావడంకళ్ళు ఎర్ర బడటం, రెప్పలు వాయటం వంటి ఇబ్బందుల్ని తేలిగ్గా తీసుకుంటాం. అయితే ఈ ఇబ్బందులు ఎక్కువ సార్లు ఎదురైతుంటే మత్రం వాటిని నిర్లక్ష్యం చేయకూడదుఅంటున్నారు డాక్టర్స్. గాలిలో ఉండే పదార్థాలు, వాహనాలపొగ ద్వారా వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వంటివి మన్ కళ్ళకు ఎక్కువ హాని చేస్తాయట. ఇంటికి రాగానే నీటితో కళ్ళను కడగటం, బైటకు వెళ్ళేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద పెద్ద ఇబ్బందులనుండి రక్షిస్తాయి.
...రమ