మహాశివుడు కిరాతకుడిగా ఎందుకు మారాడు?
(Mahashiva turns into Kirata)
''దేవేంద్రుని దగ్గర దివ్య వస్త్రాలు తీసుకో''మని ధర్మరాజు చెప్పడంతో అర్జునుడు ఇంద్రసభకు బయల్దేరాడు. అయితే, అందుకోసం ముందుగా పరమశివుని ప్రసన్నం చేసుకోమని చెప్పాడు ఇంద్రుడు.
అర్జునుడు మహాశివునికోసం ధ్యానం చేశాడు. కానీ, శివుడు వెంటనే అర్జునుని కరుణించదలచలేదు. ఒక పరీక్ష పెట్టాడు.
శివుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే -
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న ప్రదేశానికి మూకాసురుని సూకర రూపంలో పంపించాడు.
మహాశివుని ఆజ్ఞ మేరకు మూకాసురుడు పంది రూపంలో అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో తిరగసాగాడు.
మహాశివుడు కిరాతకుడిగా మారాడు. ఆ మారడంలో శివుడి అలంకారాలన్నీ రూపు మారాయి. త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసల దండగా మారాయి. ఇక పార్వతీదేవి కిరాతకుని భార్యగా అవతరించింది.
శబ్దం చేస్తూ అటూఇటూ తిరిగుతున్న పంది తపోభంగం గావించడంతో అర్జునుడు విసిగిపోయి, బాణం వేశాడు. ఆ పందినే వేటాడుతూ వచ్చినట్లు కిరాతకుడు కూడా పందికి బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు వేసిన బాణాలు తగిలి సూకరం కాస్తా ప్రాణాలు కోల్పోయింది.
ఇక ఆ పందిని నేను చంపాను అంటే నేను చంపాను అంటూ అర్జునుడు, కిరాతకుడు - ఇద్దరూ వాదులాటకు దిగారు. ఆ గొడవ ఘర్షణగా, యుద్ధంగా పరిణమించింది. ఇద్దరికిద్దరూ బాణాలు దూసుకున్నారు.
అర్జునుడు తాను విలువిద్యలో సాటిలేని మేటినని, తన బాణమే వధించిందన్నాడు. మా వృత్తే జంతువులను వేటాడటం.. నా బాణానికే ప్రాణాలు కోల్పోయిందని కిరాతకుడు..
కోపంతో రగిలిపోయిన అర్జునుడు శర పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలన్నీ వ్యర్ధం అయ్యాయి. ఒక్కటీ కిరాతకుని రూపంలో ఉన్న శివుని చేరలేదు. శివుడు వేసిన ఒకే ఒక్క బాణంతో అర్జునుడు కింద పడిపోయాడు. రగిలిపోతోన్న హృదయంతో అర్జునుడు పట్టుదలగా విల్లు సంధించాడు. దాంతో ముల్లోకాలూ కంపించాయి.
అప్పటికి గానీ అర్జునునికి జ్ఞానోదయం కాలేదు. తన ఎదురుగా ఉన్నది కిరాత దంపతులు కాదని, ఆ రూపంలో పార్వతీ పరమేస్వరులే నని గ్రహించాడు. వెంటనే పశ్చాత్తాపంతో కాళ్ళమీద పడి క్షమించమని ప్రార్ధించాడు.
మహాశివుడు చిరునవ్వు నవ్వి అర్జునుని ఆశీర్వదించాడు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు.
“Kiratarjuneeyam” and Bharavi Poet, Fight between Mahashiva and Arjuna, Mahashiva turns into Kirata, “Kiratarjuneeyam” quarrel between Arjuna and Shiva