మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు
ఆదాయం 14, వ్యయం: 14, రాజపూజ్యం: 3, అవమానం 1
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహనిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. తరచు వైద్యపరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వీరికి పదోన్నతి, స్థానచలనం ఉన్నాయి. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటె రబీ సీజన్లోనే దిగుబడి బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులెదురవుతాయి. వ్యాపారవర్గాలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరుచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ రాశివారికి వరసిద్ధి వినాయక ఆరాధన, లలితా సహస్ర పారాయణం శుభదాయకం.