తులా రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5
ఈ రాశివారి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్ధిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం. శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తుల సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వాహన, అగ్ని ఇతరత్రా ప్రమాదాలు ఎదురవుతాయి. తరచు దైవకార్యాల్లో పాల్గొంటారు. మూడు నెలలకొకసారి శనికి తైలాభిషేకం, రాహుకేతువుల పూజలు ఈ రాశివారికి కలిసిరాగలవు.