వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం : 4 అవమానం: 5


ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచు చేబదుళ్లు, రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరుచు శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తుదోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. గృహనిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. విష్ణు సహస్ర నామ పారాయణం, కనకధారా స్తోత్రములు ఈ రాశివారికి మంచి ఫలితాలిస్తాయి.


More Rasi Phalalu 2024 - 2025