సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 14, రాజపూజ్యం: 2, అవమానం 2
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులెదుర్కుంటారు. రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పనుల్లో అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు. చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. సంతానం విద్యా విషయంలో ఒకింత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ట్రాన్స్పోర్టు రంగాల వారికి నిరాశాజనకం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన ఈ రాశివారికి శుభం, జయం.