కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6

గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు చేయించుకోవటంలో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కష్టసమయం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భనూతన వ్యాపారాలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్పోర్టు, వీసాలు మంజూరవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభదాయకం. 


More Rasi Phalalu 2024 - 2025