మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం: 4


ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోను కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య తరచు కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు అధికం. చిన్నతరహా వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు. తరుచు పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి. ఈ రాశివారికి తరచు శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం.


More Rasi Phalalu 2024 - 2025