వేడికోలు
అంతానీవే అంటారు మరి ఎవరికీ కను పించవేం?
నిన్ను చూడాలంటే ఏం చేయాలి?
కాస్త చెప్పవయ్యా దేవుడా? పూజాలు చేయాలా ? ఉపాసముం
డాలా ? నిన్నెప్పుడూ తలచుకుం టుంటే చాలదా ప్రభూ!
పూజలు చేసి చేసి విసిగి పోయాను ; నిత్యమూ
పాటలు పాడీ పాడీ అలసి పోయాను; ఇంక యే
యే మాత్రమూ నిల్చునే ఓపికలేదు ;కళ్ళు బైర్లు క
మ్మి తూలి పడబోతున్నా! విధి ఎట్లున్నదో కదా !
సొమ్మసిల్లిన నాలో నీ స్మరణ నిరంతరం
సాగుతున్నట్టుగానే వుంది; దేహస్మృతి లేదు ; కా
ని, నా స్మృతిలో నీవున్నావు ;నీవుదక్క వేరు యే
మున్నది? నేను నీ దేహాన్ని కాదన్న స్మృతికల్గింది .
శరీర స్మృతి ఉన్నంత వరకే బంధనాలు, ఈ
సుఖదుఃఖాలు ,ఆ భ్రాంతి తొలగిం దంటే చూసుకో
అంతా అనందమే ! అంతా సుఖ చైతన్యమే ! ఇక
కావలసిన దేదీ కోరదగిన దేదీ వుండదు !
దివ్యానంద సుఖంలో మునిగినవానికింక కా
వలసినది ఏముంటుంది ? నిరంతర అమృత
పానం చేయటమే ! ఔను ! జీవి ముక్తిని పొందటం
అతీతమైన ఆత్మానుభవాన్ని పొందుటే మరి !
శ్రీ హరి చరణాలే నమ్మినవానికి ఇక
భయమెందుకట? అన్నీ వదలిన వారినీ ఇక
నీవే దిక్కను వార్ని తాను రక్షిస్తాననే శప
థం చేశాడు కదా స్వామి; ఈ జన్మకిది చాలదా ?
మర్యాదలేని వాన్నే;క్షుద్రున్నే ,అసూయనిండిన
వాణ్ణి, చపల చిత్తున్ని దురహంకారినే ! కృత
ఘ్నున్ని,పరుల వంచించు వాణ్ణి, పాపిష్టి వాడిని
క్రూరుడనైన నే యీ దుఃఖ సాగరాన వుంటినే !
నన్ను కనగ రావా ? నన్నుద్ధరింపగ రావ? నీ
వుదక్క ఎవ్వరే దిక్కు ?అని బాధను చెప్పు కొం
టనే తన ప్రమేయం లేదంటేనే తన అస్తిత్వం
లేదంటేనే కదా ! తాను మొరవినేది శ్రీ హరి !
పిలిస్తే పలికేవాడు ,కొలిస్తే మురిసేటి వా డు,
ఆర్తి తొలగించే వాడు ను ,కొండంత అండగా
నుండే వాడును , భక్త్యాలికి సులభుడు ఐన ఆ
దేవదేవుడు వాగ్దానాన్ని నెరవేర్చు కొంటాడు!
ప్రభూ ! నాలోని నైచ్యాన్ని , నాలోని చపలత్వము,
నాలో నిండిన దుర్గుణాల సమూహాన్ని నీ అరు
ణ కరుణ కటాక్ష వీక్షణాల నుగ్గు చేసి ,
నన్ను స్వీకరిం౧శ్రే చగా నీ పాదాల శరణ మంటిని.
అస్తు ! తథాస్తు ! శ్రీ రస్తు !
రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్
ఇది సంస్కృత శ్లోకమైన అనుష్టుప్ ఛంధ మాధారముగా వ్రాయ బడినది.