మకర సంక్రాంతి రోజు ఈ పూజలు చేసినట్లయితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి!
మకర సంక్రాంతి పండగను... ఈ సంవత్సరం జనవరి 15న తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనున్నారు.ఈ పండగ సందర్భంగా అటు సాంప్రదాయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు మకర సంక్రాంతి వేళ్ళనే మకర సంక్రమణం జరుగుతుంది. కావున మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య పైన ప్రాణాలతో ఉండి ఉత్తరాయన పుణ్యకాలం కోసం వేచి చూశాడు. ఉత్తరాయణం గడిచిన తరువాత ఏకాదశి రోజున భీష్ముడు స్వర్గారోహణం చేశాడు.అంతటి ప్రాశస్త్యం ఉంది.మకర సంక్రాంతి అటు రైతులకు కూడా పండగే. అలాగే కొత్తగా పశువులను కొనుగోలు చేసేందుకు కూడా మకర సంక్రాంతిని ఎంపిక చేసుకుంటారు.భోగభాగ్యాలతో సంక్రాంతి లక్ష్మి ఇంటికి రావాలని వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సాంప్రదాయాలు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా మీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాలనుంచి బయటపడే అవకాశం లభిస్తుంది.
-సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది. భోగి పండుగ రోజు నువ్వుల నూనెతో శరీరానికి మర్ధన చేసుకొని స్నానం చేసే నీళ్లలో రేగిపళ్ళు నువ్వులు వేసుకొని స్నానం చేయాలని అలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
-భోగి పండుగ రోజు గోవులకు అరటి పళ్ళు, పశుగ్రాసము, పాలకూర తినిపించాలని పండితులు చెబుతున్నారు.సకల దేవతలు కొలువైన గోవు పూజ చేసినట్లయితే మీరు జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు.
-సంక్రాంతి వేళ మీ ఇంటి ముంగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీమహావిష్ణువు మీ ఇంటికి తరలి వస్తాడని ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయి.
-ఇక కనుమ రోజు మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే చాలా ఆరోగ్యకరం.అలాగే కనుమ రోజు బ్రాహ్మణుడికి నల్ల మినుములు దానం చేయాలని, అలాగే నూతన వస్త్రాలు కూడా దానం చేయాలని పేద ప్రజలకు దుప్పట్లు దానం చేయాలి.
-సంక్రాంతి పర్వదినం రోజు పేద ప్రజలకు అన్నదానం చేసినట్లయితే వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా పశువులకు పూజ చేసి గోపంచకం ఇంట్లో చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాధ్యమవుతాయి.
-సంక్రాంతి పర్వదినం రోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే, ఆ మహా లక్ష్మి దీవెనలు తోడై మీరు సకల భోగభాగ్యాలతో తులతూగుతారు.