సంక్రాంతికి ఇంటి ముందు కనిపించే ముగ్గుల్లో గొబ్బిళ్లు ఎందుకు పెడతారు?

సంక్రాంతి పండుగకు పాటించే నియమాలు, పద్ధతులు వాటి వెనకుండే మన జీవనశైలి, కుటుంబ వ్యవహారాలు ఇలా అన్నీ అందులో ఇమిడి ఉంటాయి. దానిలో భాగమే గొబ్బిళ్లు కూడా. పండుగ ప్రారంభానికి నెలరోజుల ముందు నుంచే సందడి షురూ అవుతుంది. ధనుర్మాసం ప్రారంభంలోనే తెలుగు లోగిళ్లన్నీ రంగురంగుల రంగవల్లులు, గొబ్బిళ్లతో అలంకరించి...పసుపు, కుంకుమతో గౌరీదేవిని పెడతారు. భోగిరోజు సాయంత్రం గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేస్తుంటారు.గొబ్బి అనే మాట గర్భా అనే పదం నుంచి వచ్చింది. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తుంటారు. అందుకే గొబ్బెమ్మను గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తుంటారు. ఈ సందర్భంగా పాడే పాటలు చాలా అర్థవంతంగా,అద్భుతంగా ఉంటాయి. గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుడు,  శ్రీకృష్ణుడి గురించి పురాణ కథలు ఉన్నాయి. గొబ్బిపాటల్లో  శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గోబ్బిళ్ల ప్రస్తావన ఉంది.


కన్నె పిల్లల మనసు తెలిపే పాట:

సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవే
చామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవే
మొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవే
అంటూ సాగే ఈ  గొబ్బి పాట కన్నెపిల్లల కోర్కెలను, ఆడపడుచుల మనసులు తెలియజేస్తుంది.  

ముగ్గులకు గొల్లాభామా పాటను అనువాధిస్తూ పాడే పాట :

చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా
చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా

ఏ ఊరి దానవె గొల్లభామా
ఏ ఊరి దానవె గొల్లభామా
నీవు ఎక్కడికి పోయెదవె గొల్లభామా
నీవు ఎక్కడికి పోయెదవె గొల్లభామా

రేపల్లె మాఊరు అందగాడా
రేపల్లె మాఊరు అందగాడా
నేను చల్లలమ్మ బోయెదను వన్నెకాడా
నేను చల్లలమ్మ బోయెదను వన్నెకాడా
చల్లాలమ్మే గొల్లాభామా పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా

అయితే సంతలో
బేరాలు చేయగలవా గొల్లభామా
నీవు లాభాలు తీయగలవా గొల్ల భామ
నీవు లాభాలు తీయగలవా గొల్ల భామ
బేరాలు చేయగలను అందగాడా
బేరాలు చేయగలను అందగాడా
నేను లాభాలు తీయగలను అందగాడా
నేను లాభాలు తీయగలను అందగాడా

చల్లాలమ్మే గొల్లాభామా
పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా చల్లోయమ్మ చల్లా

వగలాడి దానవె గొల్లభామా నీకు నగలేమి లేవేమె గొల్లభామా
నీకు నగలేమి లేవేమె గొల్లభామా
నగలు గిగలు నాకేల అందగాడా నగలు గిగలు నాకేల అందగాడా
నాకు నామోమె నా సొగసు వన్నెకాడా
నాకు నామోమె నా సొగసు అందగాడా

అటులైతె వినుమోలె గొల్లభామ
అటులైతె వినుమోలె గొల్లభామ
నేను నిన్ను పెళ్ళి చేసుకోనె గొల్లభామా
నేను నిన్ను పెళ్ళి చేసుకోనె గొల్లభామా
నిన్నెవరు అడిగారు అందగాడా
నీ దారి నువ్వు పోవోయి కొంటెవాడా
నీ దారి నువ్వు పోవోయి కొంటెవాడా

చల్లాలమ్మే గొల్లాభామా
పిల్లల్లారా రారండోయ్
తల్లుల్లారా రారండోయ్
చల్లోయమ్మ చల్లా చల్లోయమ్మ
చల్లా చల్లోయమ్మ చల్లా

గొబ్బిపాటల్లో  శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పాడే పాట :


చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

చుంచుదువ్వి పింఛం చుట్టి - పంచదార పాలు పోసి
ఎంచరాని బోజ్జలోవేడి బువ్వపెట్టి బజ్జొపెడుదు ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

కాళ్ళకు గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
మెళ్ళోను హారం వేసెద
కాళ్ళాకు గజ్జెలు కట్టి - మెళ్ళోన్ను హారం వెసి
ఒళ్ళోను పప్పులు పోసి పిల్లనగ్రోవి చేతికిచ్చెద
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

బోజ్జకు పసిడి గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
బుజ్జి భుజములు తిప్పి ఆడరా
బోజ్జకు పసిడి గజ్జెలు కట్టి - బుజ్జి భుజములు తిప్పి ఆడి
బంగరు తొట్టె నామదిలోనా బాలకృష్ణ నిద్దురపోరా ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా


More Sankranti