సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు

The Creater Sage Viswamitra

 

విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు, అతని తండ్రి గాధి. కృశాశ్వుని వద్ద శిష్యరికం చేసి అస్త్రశస్త్రాలు సంపాదించాడు. గాధి చనిపోయిన తర్వాత రాజైన విశ్వామిత్రుడు. ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వామిత్రుడు ఒకసారి కుక్కమాంసాన్ని తిన్నాడనే కథ కూడా ఉంది.

 

ఒకసారి అడవుల్లోకి వేటకు వెళ్ళాడు. వేటాడుతున్న సమయంలో అడవిలో కనిపించిన వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.

 

వశిష్టమహర్షి వద్ద నందిని అనే ఆవు ఉంది.ఆ ఆవు కామధేనువుకు పుట్టినందున తల్లి మాదిరిగానే కోరిన కోర్కెలు తీర్చగలదు. తన ఆశ్రమానికి వచ్చిన రాజు విశ్వామిత్రునికి, ఆయన పరివారానికి చక్కగా అతిథి మర్యాదలు చేశాడు వశిష్టుడు. కామధేనువు సంతతి అయిన నందినిని ప్రార్థించి, వారందరికీ భోజనాలు సమకూర్చాడు .

 

విశ్వామిత్రుడు, కామధేనువును పోలిన ఆ ఆవును తనకిమ్మని కోరాడు.

 

అతడి కోరికను నిరాకరించాడు వశిష్టుడు.

 

తన పరాక్రమంతో వశిష్టుని జయించి, ఆవును తీసుకువెళ్ళాలనుకున్న విశ్వామిత్రుడి ప్రయత్నం వృథా అయ్యింది.

 

ఒక సందర్భంలో

తపస్సుకు ఉన్న శక్తిని గ్రహించిన విశ్వామిత్రుడు తను కూడా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అలా ఒకసారి తపస్సు చేస్తుండగా త్రిశంకుడు అనే రాజు శరీరంతో స్వర్గం పోవాలని కోరుకున్నాడు. విశ్వామిత్రుడు అతడి చేత యజ్ఞం చేయించి, అలా సంక్రమించిన శక్తితో అతడిని శరీరంతో స్వర్గానికి పంపాలనుకున్నాడు. ఆ ప్రయత్నం తుదిదశలో ఉండగా, అంటే త్రిశంకుడు శరీరంతో స్వర్గం వెడుతుండగా, ఇంద్రుడు ఇది గ్రహించి, '‘శరీరంతో స్వర్గప్రవేశం చేయడానికి అర్హత లేదు’..'' అంటూ త్రిశంకుడిని స్వర్గం నుంచి బయటకు పంపించేశాడు.

 

తలక్రిందులుగా భూమిపై పడుతున్న త్రిశంకుడు తనను కాపాడమని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు. తన తపోబలంతో భూమికి, స్వర్గానికి మధ్య త్రిశంకుడి కోసం ఏకంగా స్వర్గాన్నే సృష్టించాడు విశ్వామిత్రుడు. చివరికి ఇంద్రుడు దిగివచ్చి, మరో స్వర్గం ఉండరాదని, కనుక త్రిశంకునికి స్వర్గంలో ప్రవేశించే వీలు కల్పిస్తానని చెప్పడంతో ఆ స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు విశ్వామిత్రుడు.

 

వేరొక సందర్భంలో

ఎవరు ఘోర తపస్సు చేస్తున్నా తన దేవేంద్రుని పదవి ఎక్కడ పోతుందోనని ఇంద్రునికి తగని భయం. అందుకే ఒకసారి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆ తపస్సును భగ్నం చేసేందుకు ఇంద్రుడు మేనకను పంపించాడు.

 

మేనక వల్ల విశ్వామిత్రునికి శకుంతల అనే కుమార్తె కలిగింది.

 

శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుడు. ఇక శునశ్శేవుడి కథలో కూడా విశ్వామిత్రుడి గురించిన ప్రస్తావన వస్తుంది.

 

విశ్వామిత్రుడు కేవలం పరాక్రమవంతుడైన రాజు, తపస్సంపన్నుడైన మహర్షి మాత్రమే కాదు. హరిశ్చంద్రుడి సత్యవ్రతాన్ని పరీక్షించినదీ, రామలక్ష్మణులకు అస్త్రశస్త్రవిద్యలు నేర్పించినదీ విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడి మనుమడు భరతుడి పేరుమీదగానే భరతఖండం, భారతదేశం అనే పేర్లు వచ్చాయని చెబుతారు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

 

Indian Sage Viswamitra, Viswamitra maharshi and menaka, Viswamitra maharshi Trishanku swargam, Viswamitra maharshi and Ramalakshmana, Sage Viswamitra's daughter Shakuntala, Viswamitra and Harischandra Satyavratam, , Viswamitra maharshi and kamadhenuvu, Another Creater Sage Viswamitra


More Purana Patralu - Mythological Stories