శుక్రాచార్యునికి కన్నెలా పోయింది?

How Shukracharya Lost his Eye

 

హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. తండ్రి, విష్ణుమూర్తిని ఎంత ద్వేషిస్తాడో, కొడుకు అంత పూజిస్తాడు. అపార విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి. బలి చక్రవర్తి మహా పరాక్రమశాలి. బలి, తన బలాన్ని నిరూపించుకోడానికి, ఇంద్రునిపై దండెత్తాడు. దేవతలందరూ భయకంపితులయ్యారు.

 

ఆ సమయంలో దేవతల తల్లి అదితి, విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి , "రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకుని దేవతలను భయభ్రాంతుల్నిచేస్తున్నారు. నువ్వే రక్షించాలి'' అంటూ ప్రార్ధించింది.

 

అందుకు విష్ణుమూర్తి నవ్వుతూ తల పంకించి, ''ధైర్యంగా ఉండండి... త్వరలో నేను నీకు పుత్రుడిగా జన్మిస్తాను.. దేవేంద్రుడు తిరిగి స్వర్గాధిపతి అవుతాడు.. '' అంటూ అదితిని ఓదార్చాడు.

 

చెప్పినట్లుగానే, విష్ణుమూర్తి అదితికి వామనరూపంలో జన్మించాడు. వామనుడికి సూర్యభగవానుడు, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. భూదేవి కృష్ణాజినాన్ని, గగనాధి దేవత గొడుగును, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కుబేరుడు భిక్ష పాత్రను ఇచ్చారు.

 

ఇక వామనుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి, భిక్షాటన చేసేందుకు బలి చక్రవర్తి దగ్గరికి బయల్దేరాడు. బలి, వామనుని చూస్తూనే, ఉపనయనం పూర్తయి, వటువుగా నా దగ్గరికి వచ్చావు.. నా జన్మ ధన్యమైంది. నీకు భిక్ష ప్రసాదించడం నా అదృష్టం.. ఏం కావాలో కోరుకో'' అన్నాడు.

 

వామనుడు ధీర గంభీరంగా, ''రాక్షస రాజా, బలి చక్రవర్తీ! మూడు అడుగుల నేల కావాలి.. ఇవ్వగలవా?!" అని అడిగాడు.

 

''నువ్వు అడుగుతోంది ఒక రాజుని అని మర్చిపోయావా? ఇలాంటి అల్ప కోరిక కోరడం అన్యాయం. మరీ ఇంత చిన్న కోరికా? ఇంకేదయినా పెద్ద కోరిక కోరుకో.. ఎంతమాత్రం మొహమాటం ఒద్దు'' అన్నాడు బలి.

 

బలికి తెలీలేదు కానీ, అక్కడే సభలో ఉన్న రాక్షసుల గురువైన శుక్రాచార్యునికి వామనుడి రూపంలో వచ్చింది విష్ణుమూర్తి అని అర్ధమైంది. శుక్రాచార్యుడు భ్రుగు మహర్షి కొడుకు. దేవయాని తండ్రి.

 

ఆపద రాబోతున్నదని గ్రహించిన శుక్రాచార్యుడు లేచి ''బలీ, ఈ వామనునికి ఏమీ ఇవ్వొద్దు'' అన్నాడు.

 

బలి ఎంతమాత్రం చలించకుండా ''గురువర్యా, ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పను'' అన్నాడు. వామనుని వైపు తిరిగి, ''మూడు అడుగుల భూమియే కావాలని పట్టుపడితే అలాగే తీసుకో'' అంటూ ధార పోయడానికి కొమ్ముచెంబును చేతిలోకి తీసుకున్నాడు బలి చక్రవర్తి. ఆ దానాన్ని ఎలాగైనా ఆపి, బలి చక్రవర్తిని కాపాడాలనే ఉద్దేశంతో శుక్రాచార్యుడు, మక్షిక రూపంలో చెంబులో ప్రవేశించాడు. కొమ్ములోంచి నీరు బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశాడు.

 

'అయ్యో, నీరు ఎందుకు పడటంలేదు' - అని బలి ఆదుర్దా చెందాడు.

 

విషయం గ్రహించిన విష్ణుమూర్తి, దర్భతో కొమ్ములోనికి పొడిచాడు.

 

అంతే, కొమ్ములో అడ్డంగా ఉన్న శుక్రాచార్యుని కంట్లో దర్భ గుచ్చుకుంది. అంతటితో శుక్రాచార్యుడు, ఓ కన్ను పోగొట్టుకుని ఏకాక్షి అయ్యాడు.

 

hindu mythological character shukracharya, hindu purana stories angels and demons, hindu mythology shukracharya story, hindu bhakti story of shukracharya and vamana, vamana asked 3 feet bali chakravarti, bali chakravarti and shukracharya, vamana and bali chakravarti in hindu epics, hindu purana story and Shukracharya


More Purana Patralu - Mythological Stories