యాదవ విరోధి కాలయవనుడు
Kala Yavana
గర్గుని కుమారుడు కాలయవనుడు. ఒకసారి యాదవులు ఎగతాళి చేయడంతో వారిపై పగ పెంచుకున్న గర్గుడు, అతి బలవంతమైన కుమారుడిని పొందేవిధంగా శివుని నుండి వరం పొందుతాడు. అలా వరప్రభావంతో జన్మించినవాడే కాలయవనుడు. పెరిగి పెద్దవాడైన కాలయవనుడు తండ్రి పగ గురించి తెలుసుకుని, యాదవులపై పగతీర్చుకునేందుకు మధురానగరి మీద దాడికి సిద్ధమవుతాడు.
యాదవులకు నాయకత్వం వహిస్తున్న శ్రీ కృష్ణునికి మరో శత్రువు కూడా ఉన్నాడు. అతడు జరాసంధుడు. కాలయవనుడు యుద్ధానికి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ఇదే సమయంలో జరాసంధుడు కూడా యుద్ధానికి వస్తే గెలవడం కష్టమని భావించి, విశ్వకర్మను పిలిపించి సముద్రం మధ్యలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించవలసిందిగా కోరతాడు. అతి తక్కువ సమయంలో విశ్వకర్మ ఆ పని పూర్తిచేస్తాడు.
వెంటనే మధురను ఖాళీ చేసి ద్వారకకు తరలిపోతారు. ఒకసారి అనుకోకుండా తనకు తారసపడిన శ్రీ కృష్ణుడితో యుద్దానికి సిద్దపడతాడు కాలయవనుడు. శివుడి వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి ప్రవేశించి అదృశ్యమవుతాడు ముచికుందుడికి నిద్రాభంగం కలిగించిన కాలయవనుడు, అతని కళ్ళు తెరచి చూడగానే భస్మమవుతాడు.
Hindu epics Kala Yavana, hindu mythology Kala Yavana , hindu mythological character Kala Yavana