శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి

 

Description of Sri Endala Mallikarjuna Swamy Temple Srikakulam history, Largest Shivalinga in India, Tallest Shivalingam in Indian History, Shiva Lingam in Openplace

 

 

 

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం రావివలసలోని ఎండ మల్లికార్జునస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి. కానీ,  ఎండ మల్లికార్జునస్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆ స్వామి నేటికీ కొండ మీద ఆరుబయటే కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కొండమీద కొలువైన శివలింగం అతి పెద్దది. ఇంట పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు. పురాతన కాలం నుంచే ఇది ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరు పొందింది. కార్తీక మాసంలోనూ అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, శివరాత్రి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని లింగోద్భావాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తీక సోమవారం నాడు ఈక్షేత్రంలో అభిషేక, ఉపవాస, జాగరణలు ఎవరు చేస్తారో వారి మనోవాంఛలు సిద్ధిస్తాయని,  ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యంగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం.

క్షేత్ర ప్రశస్తి

 

 

Description of Sri Endala Mallikarjuna Swamy Temple Srikakulam history, Largest Shivalinga in India, Tallest Shivalingam in Indian History, Shiva Lingam in Openplace

 

 


శ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో కల మహారణ్య ప్రాంతములో కల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేసాడు. అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే దేవవైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషద, మూలికా వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషదాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండటం అతనిని ఆశ్చర్యపరచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచాడు. బొందితో కైలాసం చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకోవడానికి కూడా ఇదేమంచి ప్రదేశంగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరులతో తరలి వెళ్ళిపోయాడు. తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంబించాడు. కొంతకాలం తరువాత సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమసమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించలేదు కాని అతని కళేబరం కనిపించింది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్ళిపోతాడు.

 

 

Description of Sri Endala Mallikarjuna Swamy Temple Srikakulam history, Largest Shivalinga in India, Tallest Shivalingam in Indian History, Shiva Lingam in Openplace

 

 


హనుమంతుని ద్వారా విషయం తెలిసిన రాముడు సీత, లక్ష్మణ హనుమంతునితో కలసి సుమంచ పర్వతానికి వచ్చాడు. సుశేణుని కళేబరాన్ని రాముడికి చూపించడానికి  జింక చర్మాన్ని పైకి లేపాడట హనుమంతుడు. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగం కనిపించిందట. దానిపై పువ్వులు ఉన్నాయట. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానంచేసి శివలింగాన్ని పూజించుటం ప్రారంబించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషద, మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం, ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమించాడట. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించిందిది. మల్లెపూలతో పూజింపబడి జినంతో{చర్మం} కప్పబడీ ఉన్నపుడు వెలసిన స్వామి కనుక మల్లికాజిన స్వామిగా పిలువబడుతుండేవాడు. క్రమంగా మల్లికార్జునినిగా మార్పు చెందినది.

 

 

Description of Sri Endala Mallikarjuna Swamy Temple Srikakulam history, Largest Shivalinga in India, Tallest Shivalingam in Indian History, Shiva Lingam in Openplace

 

 


ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చి అప్పటికి సీతా కుండంగా పిలవబడుతున్న అక్కడి కొలనులో స్నానం స్వామిని పూజిస్తూ అక్కడ కల గుహలో నివాసం ఉండే సమయంలో ఈ పర్వతంపై అర్త్జునుడు శివుని గురించి తపస్సు చేశాడు. అర్జునుని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దానికి అర్జునుడు ' ఓ మల్లికార్జునేశ్వర నీ పేరు మీద ఈ క్షేత్రం ఖ్యాతి పొందాలి' అని కోరుకున్నాడు. అప్పటినుంచి ఈ క్షేత్రానికి మల్లిఖార్జునస్వామి దేవస్థానంగా పేరువచ్చింది.

దేవాలయ చరిత్ర:

 

 

Description of Sri Endala Mallikarjuna Swamy Temple Srikakulam history, Largest Shivalinga in India, Tallest Shivalingam in Indian History, Shiva Lingam in Openplace

 

 


1870 ప్రాంతములో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ మల్లిఖార్జునస్వామికి ఆలయం నిర్మించగా అది తొందరలోనే కొంతకాలానికి శిథిలమై పోయింది. మరికొంతకాలానికి ఆలయనిర్మాణానికి పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దనీ వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండటమే తనకు ఇష్టమనీ అదే లోక కళ్యాణమనీ, ఎండకు ఎండి, వానలో తడవడం వల్లనే ఎండ మల్లిఖార్జునస్వామిగాప్రాచుర్యం పొందుతానని తెలియజేసాడు. అప్పటినుండి ఈ శివలింగం ఎండ మల్లిఖార్జునస్వామిగా పేరొందింది.


రవాణా, వసతి సౌకర్యాలు : శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రావివలస శైవక్షేత్రం ఉంది. శ్రీకాకుళం నుంచి టెక్కలికి, టెక్కలి నుంచి రావివలసకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఉన్నాయి. టెక్కలి నుంచి ఆటోరిక్షాలు కూడా రావివలసకు తిరుగుతాయి. బస చేయాలనుకునేవారు జిల్లా కేంద్రంలో బస చేయవచ్చు.


More Punya Kshetralu