నవరాత్రులు రెండవరోజు (పాల ముంజెలు)
కావలసిన పదార్దాలు:
వరిపిండి - 1 కప్పు
మైదా - 1 స్పూన్
పాలు - 1/౩ కప్పు
ఉప్పు - చిటికెడు
శెనగపప్పు - 1 కప్పు
బెల్లం - ౩/4 కప్పు , కప్పు కంటే తక్కువ
నూనె - వేయించుకోవడానికి సరిపడా
నెయ్యి - చెంచా
తయారీ విధానం:
ముందుగా శెనగపప్పు అరగంట నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి... మిక్సీలో ఒకసారి ఇలాచీలు వేసి తిప్పి తిసేయ్యాలి. దళసరి మూకుడులో బెల్లం తరుగు ఈ శెనగపప్పువేసి ఉండగా అయ్యేలా పూర్ణం తయారుచేసుకొని ఒక చెంచా నెయ్యిని కలిపి చల్లారనివ్వాలి. మరొక గిన్నెలో పాలు మరిగించి అరకప్పు నీటిని కలిపి ఉప్పు వేసి సలసలా కాగుతున్నప్పుడు సెగ తగ్గించి కొద్దికొద్దిగా వరిపిండి, మైదాపిండిని వేసి కలుపుతూ ఉండకట్టకుండా కలిపి పోయ్యిమీంచి దింపెయ్యాలి .... ఇలా వరిపిండి ఉక్కబెట్టాలి. కొద్దిగా చల్లారినాక దానిని పళ్ళెంలోకి తీసుకొని నూనెచేతితో పిండిని మెదిపి... ఒక ఉండను తీసుకొని అరచేతిలో పరుచుకొని శెనగపప్పు పూర్ణం ఉండను మధ్యలో పెట్టి మూసెయ్యాలి.... ఇలా ఉండలు చుట్టుకొని నూనె వేసి.. అయ్యాక సెగ తగ్గించి చిన్న మంటలో ఈ బూర్లు వదలాలి... ఇవి విడిపోవు, చిదగవు.... చాలా చక్కగా గుండ్రంగా వస్తాయి. చాలారుచిగా ఉంటాయి. దసరాలో అమ్మకి ఇవి ఒక చక్కని నైవేద్యం.
- భారతి
