మ్యాంగో కలాకండ్

 

 


పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. ఒక పక్క పచ్చి మామిడికాయలు మరో పక్క నోరూరించే మామిడిపళ్ళు.  ఇవన్ని చూస్తూ ఏ వెరైటీ రెసిపీ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ఎ రోజు మామిడి పళ్ళతో కలాకండ్ ఎలా చెయ్యాలో చూసేద్దాం.

 

కావాల్సిన పదార్థాలు:

మామిడి పండు గుజ్జు - 3 కప్పులు

పంచదార - 3 కప్పులు

పాలవిరుగుడు - 2 కప్పులు

నెయ్యి 3 చెంచాలు

యాలకుల పొడి - 1/4 చెంచా 

డ్రై ఫ్రూట్స్ - 1/2 కప్పు

 

తయారి విధానం:

మనింట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిన పాలని బయట పారేయకుండా మామిడి రసంతో కలిపి చక్కగా కలాకండ్ చేసుకోవచ్చు. పాలు విరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక బట్టలో గాని లేదా జాలిలోగాని ఆ విరుగుడు వేసి నీరంతా పోయేలా చూడాలి. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి ముందుగా పంచదార వేసి తరువాత మామిడి గుజ్జుని వేసి మొత్తాన్ని బాగా కలపాలి. పంచదార కరిగిపోయి ఒక 10 నిమిషాలు అయ్యాకా పాల విరుగుడును కూడా వేసి అలా తిప్పుతూ ఉండాలి. అందులో నెయ్యి వేసి  మిశ్రమం అంతా దగ్గర పడ్డాకా దానిలో నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కదుపుతూ ఉండాలి. మిశ్రమం  దగ్గరపడిన తరువాత స్టవ్ ఆపి దానిని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి తీయాలి. కాస్త చల్లారుతుండగా కావాల్సిన షేప్ లో ముక్కలు కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారేసరికి కలాకండ్ మీ ముందు ఉంటుంది.


...కళ్యాణి