జున్ను 

 

 

కావలసిన పదార్ధాలు :

* జున్నుపాలు                     - 1 కప్పు 

* పచ్చిపాలు                      - 1 కప్పు

* బెల్లం                              - 1 కప్పు 

* మిరియాలు, యాలకులపొడి   - 1/4 స్పూన్ 

 

తయారుచేసుకునే విధానం :

* ముందుగా బెల్లం తరిగి లేక దంచి ఉంచుకోవాలి... జున్నుపాలు .. మాములు పచ్చిపాలు కలిపి బెల్లాన్ని ఆ పాలల్లో కరిగే వరకు కలపాలి.

* తరువాత కొంచం  బెల్లంలో మలినాలు ఉన్నట్లయితే వడగట్టుకొని.. తరువాత మిరియం, యాలకులపొడి కలిపి కుక్కర్ లో గాని ఇడ్లీ పాత్ర గిన్నెలో గాని 10 నుండి 15 నిమిషాలు విజిల్ లేకుండా ఇడ్లీ ఉడికించినట్లు నీటిలో స్టాండు పెట్టి జున్నుపాలు పోసిన గిన్నె పెట్టి మూతపెట్టి చిన్న మంటపై ఉడికించుకోవాలి. 

* జున్ను దగ్గరపడినట్లు తెలియగానే మంట ఆపి పూర్తిగా చల్లరనిస్తే మరింత దగ్గరపడి  పూర్తిగా గట్టి పడుతుంది. చాకుతోగాని కేల్ నైఫ్ తో గాని కోసుకుని గరిటతో గిన్నెలలో వడ్డించుకోవాలి. అందరికి నచ్చే రుచికరమైన జున్ను రెడీ..

నోట్.. ఈ జున్ను పాల కొలతలు ఎలా అంటే మొదటి పూట పాలు - 1 కప్పుకి - 2 కప్పులు. రెండవ పూటకి - కప్పుతో సమానం పచ్చిపాలు - మూడవ పూటకి వాడేసుకోవచ్చు .... మిరియాల పొడి తప్పక వేయాలి.... సువాసన మరియు జున్ను వల్ల వచ్చే వాతాన్ని హరిస్తుంది..