LATEST NEWS
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ  నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య  44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన  షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్  కూడా మిగలలేదు.  అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు  కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప  మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే  1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.  అయితే  ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా  ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా  సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక  వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ  పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన  కారణం  కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు,  కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే  కారణమని కాంగ్రెస్  పార్టీ మరో మారు గుర్తించింది.  ఈ నేపద్యంలో  అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 - 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు  కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు  ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది. ముఖ్యంగా  రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే  దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా  ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే  ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’  తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం  లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.   ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత  తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే  కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా,  గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్  వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే  ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి  ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం...  గుజరాత్  ను గెలవాలి!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.  పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి
బీఆర్‌ఎస్ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే  అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  2023లో షకీల్ కొడుకు రహేల్ వేగంగా కారు నడుపుతూ బేగంపేట ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా దుబాయిలో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ  పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో  అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.  గతంలో గులాబీ బాస్ ఏఐజీ హాస్పిటాల్‌‌కి వచ్చి హెల్త్ చెకప్ చేయించకున్నారు. సాధారణ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రజత్సోవాలను అధినేత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో  పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం నింపిటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌పార్టీ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే  తొలి పార్టీ ఆవిర్బ సభ కావడంతో దీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సభలో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కి సీట్లు రాకపోవడంతో క్యాడేర్ నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సహం నింపాటానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  Cast: Sunny Deol, Randeep Hooda, Regina Cassandra, Saiyami Kher, Vineeth Kumar Singh, Jagapati Babu, Ramya Krishnan Crew:  Music by S Thaman Cinematography by Rishi Punjabi Editing by Navin Nooli  Directed by Gopichand Malineni  Produced by Naveen Yerneni, Ravi Yelamanchali, T.G. Vishwa Prasad, Umesh KR Bansal  Jaat starring Sunny Deol marks the debut of renowned Telugu Cinema production houses like Mythri Movie Makers and People Media Factory in Hindi, directly. It also marks Gopichand Malineni's debut as a director in Hindi and with Telugu commercial formula finding unimaginable success Pan India, let's discuss about Jaat at length.    Plot:  Ranathunga (Randeep Hooda) is a refuge from Sri Lanka and he runs away from his country as Separatist Tiger Forces have been subdued by the nation's military. He brings a box full of gold with his brothers to India. At Chirala, he finds a corrupt cop and takes over the entire costal area of Prakasam district over 15 years.  His wife (Regina Cassandra) also helps him in his activities. She subdues a battalion of brave women police personnel and kidnaps them in her house. An unnamed man (Sunny Deol) walks into Motupalle, the main hub of Ranathunga and he gets toughened up on the wrong side. How does he deal with Ranathunga as he is Brigadier Balbir Pratap Singh of JAT regiment? Watch the movie to know more.    Analysis:  Sunny Deol is in top form as Balbir and his action sequences are designed well to go with his "Dhaai Kilo Ka Haath" star power and screen presence. But the first hour just uses his action prowess but his character gets nothing new to perform. Second hour has few emotional scenes and he shines in them.  Saiyami Kher, Vineeth Kumar Singh, Regina Cassandra leave a strong impression. Randeep Hooda is terrific as a terrifying villain. All others don't really get much to do. The focus of the filmmaker is more on making it a non-stop actioner in true blue video game style.  It is like Sunny Deol crosses one level after another in the first hour and then gets into the story. Gopichand Malineni did his best in presenting and elevating a superstar of 90's to showcase his full glory. He made use of his strong forte action and his image pretty well.  The movie feels like overdrive of mass commercial masala at places but still it has a lot to offer for action lovers. Mythri Movie Makers and People Media Factory did good job in setting this film up and the production values are top level. Still, a bit more concentration on writing could have made it even bigger entertainer.    In Conclusion:  Jaat is an easy one-time watch for all action lovers.    Rating: 2.75/5    
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్న కుమారుడు'మార్క్ శంకర్ పవనోవిచ్' రీసెంట్ గా సింగపూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురి కావడంతో గాయాల బారిన పడ్డాడు.దీంతో  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శంకర్ కోలుకోవాలని తమ బ్లెస్సింగ్స్ తెలియచేస్తున్నారు.మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను.మీ చిన్న యోధుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మీరు మీ కుటుంబసభ్యులు దైర్యంగా ఉండాలంటు ట్వీట్ చేసాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ ట్వీట్ కి  పవన్ రిప్లై ఇస్తు ప్రియమైన ఎన్టీఆర్ గారు మీ మాటలకు ధన్యవాదాలు.ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతును అభినందిస్తు ధన్యవాదాలు తెలుపుతున్నాను.లిటిల్ వన్ కొలుకుంటున్నాడంటూ ట్వీట్ చేసాడు.  
  Cast: Ajith Kumar, Trisha Krishnan, Arjun Das, Jackie Shroff, Prasanna, Karthikrya Dev, Redin Kingsley, Yogi Babu, Simran, and others Crew:  Cinematographer : Abinandhan Ramanujam Editor : Vijay Velukutty Music Director : GV Prakash Kumar Writer - Director : Adhik Ravichandran Producers : Naveen Yerneni, Y Ravi Shankar   Ajith Kumar is one of the biggest stars of Tamil Cinema and craziest in Indian Cinema with massive fan following. The star is struggling with underwhelming films and post a disaster like Vidaamuyarchi, he has come up with highly anticipated Good Bad Ugly, in the direction of Adhik Ravichandran. Mythri Movie Makers are debuting in Tamil with this high budget film. Let's discuss about the film in detail.    Plot:  AK (Ajith Kumar) is a huge gangster, known as Red Dragon. He decides to leave everything and surrender himself to Mumbai Police. He gets life imprisonment and for seventeen years, he doesn't meet his family. His wife Ramya (Trisha Krishnan) wants him to change his past and return to their family, as a normal man. His son, Vihaan, on the other hand wants to meet him and everyone hides AK's real identity.  His son asks him to come to his convocation and  AK fails to fulfil his wish. Vihaan demands his presence for his 18th birthday and AK takes permission for early release. By the time, he returns to his family, Vihaan is arrested in a drug case. AK has to become Red Dragon again to bring justice for his son. How does he achieve it? Watch the movie to know more.    Analysis:  Ajith Kumar did his best in an eccentric character and after a long time, he looked like enjoying his eccentricities as well. He delivered a complete active performance in this movie and it looked refreshing to see him like this. His different looks and styles give huge highs to fans.  Trisha, Simran slightly over acted in their roles. Arjun Das did his best in a dual role. All other performers did their best within the scope provided in the script. The action sequences could have been designed better in the first half. The second half slights drags the thin storyline to exasperating lengths.  Still, Ajith Kumar carries the film on his shoulders with his magnetic screen presence and apt performance. His different avatars and throw back to old cult films work big time for his fans. Also, the elevation scenes work within the story, yet few feels like over stretched.  Adhik Ravichandran needed to concentrate on writing a bit more innovative and creative story for everything to work big time. While the movie works due to the big star's energetic presence it could have been even better with better writing.    In Conclusion:  Movie works as a pure fan service but needed a little more story to become even better.    Rating: 2.5/5  
  తారాగణం: అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్, కార్తికేయ దేవ్, యోగిబాబు, ప్రభు, రాహుల్ దేవ్ తదితరులు సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ డీఓపీ: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025   ఈ ఏడాది ఫిబ్రవరిలో 'విడాముయ‌ర్చి'(పట్టుదల)తో నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్.. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో ప్రేక్షకులను పలకరించాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. మరి ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఎలా ఉంది? అజిత్ ఒక భారీ విజయాన్ని అందుకుంటే చూడాలని ఆశపడుతున్న అభిమానుల కోరిక ఈ చిత్రంతో నెరవేరిందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.   కథ: ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్ కుమార్) ఒక గ్యాంగ్ స్టర్. భార్య రమ్య(త్రిష), కుమారుడు విహాన్‌(కార్తికేయ దేవ్)లతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి.. క్రిమినల్ జీవితాన్ని వదిలి పోలీసులకు లొంగిపోతాడు. జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన ఏకే.. తన కుమారుడు విహాన్‌ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడని తెలుసుకుంటాడు. కొడుకుని రక్షించుకోవడం కోసం మళ్ళీ గ్యాంగ్ స్టర్ అవతారమెత్తుతాడు. అసలు ఏకే ఎవరు? అతను తన గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఎందుకు వదులుకున్నాడు? విహాన్‌ కి వచ్చిన సమస్య ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? కొడుకు విహాన్‌ కోసం మళ్ళీ గ్యాంగ్‌స్టర్ గా మారిన ఏకే.. కొడుకుని రక్షించుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: కథగా చూసుకుంటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిన్న కథే. అయితే అజిత్ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ కథను తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ బాగానే సక్సెస్ అయ్యాడు. అధిక్ కథాకథనాల కంటే కూడా అజిత్ ని స్టైలిష్ గా చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇది ఫ్యాన్స్ కి ట్రీట్ లా అనిపించవచ్చు. అదే సమయంలో జనరల్ ఆడియన్స్ కి మాత్రం నచ్చకపోవచ్చు. కథలో కొత్త మెరుపుల్లేవు, కథనంలో ఊహించని మలుపులు లేవు. అయినప్పటికీ హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో బోర్ కొట్టకుండా సినిమాని బాగానే నడిపించాడు అధిక్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని నడిపించిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. స్క్రిప్ట్ లో ఎమోషనల్ డెప్త్ ఉండేలా చూసుకోవాల్సింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకొని ఉండాల్సింది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయితే.. కేవలం ఫ్యాన్స్ కే కాకుండా, సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చే అవకాశముండేది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: అజిత్ కుమార్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేశాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కి పండగే. వింటేజ్ అజిత్ కనిపించాడు. త్రిష పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. విలన్ గా అర్జున్ దాస్ బాగానే న్యాయం చేశాడు. సునీల్, జాకీ ష్రాఫ్, కార్తికేయ దేవ్ తదితరులు వారి పాత్రల పరిధి మేర నటించారు. సిమ్రాన్ అతిథి పాత్రలో మెరిసింది. రచయితగా అంతగా మెప్పించలేకపోయిన అధిక్.. దర్శకుడిగా మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు. అజిత్ ని స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన తీరు, స్టైలిష్ మేకింగ్ మెప్పించాయి. అభినందన్ రామానుజం కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆయన ప్రతిభ కనిపించింది. జి.వి. ప్రకాష్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ని పరుగులు పెట్టించిన ఎడిటర్ విజయ్, సెకండ్ హాఫ్ లో చేతులెత్తేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకొని ఉండాల్సింది.   ఫైనల్ గా.. స్టోరీని కాదు, హీరోయిజాన్ని నమ్ముకొని తీసిన సినిమా ఇది. అజిత్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. అజిత్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుంది. జనరల్ ఆడియన్స్ కి మాత్రం నచ్చే అవకాశాలు తక్కువే.   రేటింగ్: 2.5/5  
Cast: Siddhu Jonnalagadda, Vaishnavi Chaitanya, Naresh Sr, Bhramaji, Shabeer Kallarakka, Prakash Raj, Ravi Prakash, and Rahul Dev Crew:  Cinematography by Vijay K Chakravarthy  Music Composed by Sam CS, Suresh Bobbili, Achu Rajamani  Written & Directed by Bhaskar  Produced by BVSN Prasad    Jack starring Siddhu Jonnalagadda and written & directed by "Bommarillu" Bhaskar after a short gap, released today with a huge fanfare. The movie trailers and songs did create good enough buzz for the film. Let's talk about the movie, in detail.    Plot:  Pablo Niruda (Siddhu Jonnalagadda) wants to become a R & AW agent and he takes a name, Jack. He tries to intervene into big missions without proper training. He writes the exam and go to R & AW interview. Before he gets any answer, he starts his own Mission Butterfly. He tries to solve a huge terrorist plan but ends up intervening officer Manoj (Prakash Raj) plans. What happens next? Watch the movie to know more.    Analysis: Siddhu Jonnalagadda is good within his character scope and he tried to infuse life into every scene, he is in. But his character lacked any sort of connective emotion and intelligence that is promised by the makers. His energetic antics and dialogue delivery salvages few scenes.  Vaishnavi Chaitanya did not get a consistent character but she is good in few scenes. Prakash Raj did his best to deliver in an inconsistent film with his passion. But others like Naresh and Brahmaji disappoint us.  Bommarillu Bhaskar failed to really live up to the good storyline he took on. He tried to write it like a Sherlock Holmes film but he couldn't really get the tone right. The film struggles to even deliver on the character continuity.  The music and every aspect are also underwhelming to even talk about. Overall, the movie is a complete misfire with every element not living up to the potential.    In Conclusion:  Movie falls flat and fails to deliver on potential.    Rating: 2/5  
తమిళ చిత్రసీమలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.1996 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని,ప్రజలను ఆ దేవుడు కూడా రక్షించలేడంటు వ్యాఖ్యలు చేస్తే జయలలిత(Jayalalitha)సీఎం పదవి కోల్పోయింది.రజనీ కి ఉన్న ఫాలోయింగ్ కి ఇదే ఉదాహరణ. అయితే  జయలలిత గురించి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో రజనీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.    రజనీ మాట్లాడుతు' అన్నాడీఎంకే నేత, సినీ నిర్మాత ఆర్.ఎం. వీరప్పన్‌ (Veerappan)కి,నాకు మధ్య మంచి స్నేహం బంధం ఉంది.బాషా మూవీకి ఆయనే నిర్మాత.మూవీ పెద్ద సక్సెస్ కావడంతో 1995లో చెన్నైలో శత దినోత్సవ వేడుకలు నిర్వహించాం.ఆ సమయంలో జయలలిత ప్రభుత్వంలో వీరప్పన్ మంత్రిగా ఉండటం వలన నిర్మాత హోదాలో'బాషా’ఈవెంట్లో పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని, రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని నేను చెప్పాను.రజినీకాంత్ వ్యాఖ్యలు మీరెందుకు ఖండించలేదని  వీరప్పన్ ని కోప్పడిన జయలలిత మంత్రి పదవి నుంచి తప్పించింది.ఈ విషయంలో చాలా బాధపడ్డాను.వీరప్పన్‌కి ఫోన్ చేసి జయలలితతో నేను మాట్లాడతానని అంటే నాకోసం మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు.నాకు పదవులు ముఖ్యం కాదని వీరప్పన్ చెప్పాడు.నా మిత్రుడికి జరిగిన అన్యాయం వల్లనే రాజకీయ పరమైన విషయాల్లో జయలలితని  వ్యతిరేకించాను. అయితే తాను ఎంత తొందరపాటుగా వ్యవహరించానో  అర్ధం చేసుకొని జయలలిత మరణించిన తర్వాత తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో 1996లో జయలలితపై వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశాను.నావల్లే ఓడిపోయారని తెలిసినా జయలలిత పెద్ద మనసు చేసుకుని నా  కుమార్తె వివాహానికి వచ్చారు.ఈ ప్రపంచంలో గురువును మించిన శిష్యులు కొందరే ఉంటారు.అలాంటి వారిలో జయలలిత ఒకరని కొనియాడారు.రజనీ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీతో పాటు 'నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేస్తున్నాడు.ముందుగా 'కూలీ' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
రేణుకస్వామి హత్యకేసులో సినీనటుడు దర్శన్(darshan)కొన్నినెలల పాటు జైలు శిక్షఅనుభవించిన అనంతరం ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.కాకపోతే కోర్టు నిబంధనల ప్రకారం కేసు విచారణ సమయంలో దర్శన్ కోర్టులో తప్పని సరిగా హాజరు కావాలి.కానీ నిన్న మంగళవారం జరిగిన విచారణకి హాజరు కాలేదు. నడుం నొప్పి కారణంగానే దర్శన్ విచారణకి హాజరుకాలేదని ఆయన తరుపు లాయర్ కోర్టుకి చెప్పడం జరిగింది.దీంతో ఆ సమాధానంపై సంతృప్తి పడని న్యాయమూర్తి,కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను దర్శన్ కోర్టులో ఉండాలి.ఇలాంటి సాకులు చెప్తు హాజరు కాకపోతే ఎలా అంటు తన ఆగ్రహాన్నివ్యక్తం చేసాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కోర్టులో కేసు పూర్తయిన కొన్నిగంటల్లోనే దర్శన్ బెంగుళూరులోని థియేటర్ లో 'వామన'అనే స్పెషల్ షో స్క్రీనింగ్ కి వెళ్ళాడు.మూవీ కంప్లీట్ అయ్యాక మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది.అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో పలువురు నెటిజన్స్ దర్శన్ తీరుపై మండిపడుతున్నారు.  
ఎన్నడూ లేని విధంగా గత ఏడాది నుంచి సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు తలెత్తుతున్నాయి. వాటిలో మంచు ఫ్యామిలీ వివాదం కోర్టుకెక్కడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఒకింత ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. జల్‌పల్లిలోని ఇంటికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఎల్‌.బి.నగర్‌ కోర్టు మోహన్‌బాబు పెట్టుకున్న పిటిషన్‌ని కొట్టి వేసింది. అంతేకాదు, అక్కడ పనిచేస్తున్న కోర్టు క్లర్క్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అతనికి మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనంతటికీ కారణం మనోజ్‌ ప్రవేశ పెట్టిన కీలక ఆధారాలే అని తెలుస్తోంది. మోహన్‌బాబుకి కోర్టు షాక్‌ ఇవ్వడంతో మనోజ్‌కి ఊరట లభించింది. తన ఇంటిలోకి మనోజ్‌కి ప్రవేశం లేదని, ఆ విధంగా తీర్పునివ్వాల్సిందిగా గతంలో కోర్టులో పిటిషన్‌ వేశారు మోహన్‌బాబు. ఎల్‌.బి.నగర్‌ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలు, మనోజ్‌ సమర్పించిన ఆధారాలతో మోహన్‌బాబు వేసిన పిటిషన్‌ను కోర్టు మరోసారి విచారణకు తీసుకుంది. అన్నీ పరిశీలించిన కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  తన కుమార్తె పుట్టినరోజు నిమిత్తం ఇటీవల మనోజ్‌ కుటుంబం రాజస్థాన్‌ వెళ్లింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు మనోజ్‌ ఇంటిపైనా, ఆఫీస్‌పైనా దాడి చేసి కొన్ని వస్తువులు, కార్లు దొంగిలించుకొని వెళ్లారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలన్న ప్రయత్నాన్ని కూడా విష్ణు అడ్డుకున్నాడని మనోజ్‌ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, తన కేసు విషయంలో నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బుధవారం జల్‌పల్లి ఇంటి దగ్గర మీడియాతో చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు మనోజ్‌. తన తండ్రి తరఫు న్యాయవాదులు కూడా కోర్టును మోసం చేస్తున్నారన్నారు. మొత్తానికి మనోజ్‌ తన తండ్రి మోహన్‌బాబుకు కోర్టు ద్వారా షాక్‌ ఇచ్చారు. అయితే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మోహన్‌బాబు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మనోజ్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అతని దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి మంచు ఫ్యామిలీ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందీ, అసలు దీనికి క్లైమాక్స్‌ ఉందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
అర్జున్ రెడ్డి తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)ఆయన గత కొంత కాలంగా చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడుతు అర్జున్ రెడ్డి మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు రథన్ చాలా ఇబ్బంది పెట్టాడని,కష్టపడి బతిమాలి వర్క్ చేయించుకున్నట్టుగా మాట్లాడుతు వస్తున్నాడు. ఈ విషయంపై రీసెంట్ గా రథన్(Radhan)మాట్లాడుతు సందీప్ రెడ్డి వంగ నాకు తండ్రితో సమానం.ఆయన అర్జున్ రెడ్డితో అవకాశం ఇవ్వకపోయి ఉంటే అంత మంచి ఆల్బమ్ వచ్చేది కాదు.అందుకే ఆయన నా గురించి మాట్లాడుతున్నది పట్టించుకోలేదు.నాన్న తిట్టాడని అందరిలోను చెప్పుకోలేం కదా! ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినప్పుడు కొన్నింటిని ఏ విధంగా అయితే పట్టించుకోవాలో,అదే విధంగా కొన్ని పట్టించుకోకూడదు.సందీప్ మాట తీరు కొంచం కఠినంగా ఉంటుంది.నాతోనే కాదు అందరితోను అలాగే మాట్లాడతారు.కాకపోతే నేను బాధపడే విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి కి సంబంధించి ఫస్ట్ సాంగ్ రికార్డు అయినప్పుడే నాకు నచ్చలేదంటే ప్రాజెక్టు నుంచి వెళ్ళేవాడిని.కాకపోతే అన్ని సాంగ్స్ పూర్తయ్యాక నచ్చలేదని అన్నారు. ఆ తర్వాత అనుదీప్(Anudeep)తో వర్క్ చేశాను.ఆయన చాలా నిదానం మనిషి.అందరు ఒకేలా ఉండాలని రూల్ లేదు.ఏ మూవీ కైనా మంచి సంగీతాన్ని ఇవ్వడానికి కష్టపడతాను.అర్జున్ రెడ్డి మ్యూజిక్ విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్పకొచ్చాడు.రథన్ కెరీర్ లో ఇప్పటి వరకు'అందాల రాక్షసి,రాధ,మనసుకు నచ్చింది,హుషారు.ఆర్ డి ఎక్స్ లవ్ పాగల్,భజేవాయువేగం ఇలా సుమారు 15 కి పైగా తెలుగు చిత్రాలు ఉన్నాయి.పలు తమిళ,కన్నడ భాషల్లోకి చిత్రాలకి కూడా మ్యూజిక్ ని అందించాడు.    
  తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి బీజీఎం: సామ్ సి.ఎస్ డీఓపీ: విజయ్ కె. చక్రవర్తి ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా ఎడిటర్: నవీన్ నూలి  రచన, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్  నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025   డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు జాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. భాస్కర్ తన ఇమేజ్ కి భిన్నంగా, యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందించాడు. మరి ఈ జాక్ మూవీ ఎలా ఉంది? దర్శకుడిగా భాస్కర్ మెప్పించాడా? టిల్లుగా రెండు సినిమాలతో మ్యాజిక్ చేసిన సిద్ధు, జాక్ తో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Jack Movie Review)   కథ: పాబ్లో నెరుడా అలియాస్ జాక్(సిద్ధు జొన్నలగడ్డ)కి 'రా' ఏజెంట్ కావాలనేది డ్రీమ్. అందుకోసం చిన్న చిన్న ఆపరేషన్స్ చేస్తూ తనను తాను రా ఏజెంట్ గా మలుచుకుంటూ ఉంటాడు. బాగా ప్రిపేర్ అయ్యి 'రా' ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. అయితే ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైందో ఇంకా తెలియకముందే.. ఇండియాకి టెర్రరిస్ట్ ల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకొని, బటర్ ఫ్లై పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని మొదలుపెడతాడు. ఆ ఆపరేషన్ ఏంటి? దాని వల్ల జాక్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? జాక్ చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ తెలిసి, 'రా' అతనిపై చర్యలు తీసుకుందా? జాక్ తలపెట్టిన ఆపరేషన్ బటర్ ఫ్లై సక్సెస్ అయిందా? రా ఏజెంట్ కావాలన్న అతని డ్రీమ్ నెరవేరిందా? బేగం అలియాస్ భానుమతి(వైష్ణవి చైతన్య)తో జాక్ ప్రేమకథ ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: కామెడీ సినిమాలలో లాజిక్ లు ఎవరూ అడగరు. కాసేపు ప్రేక్షకులను నవ్విస్తే చాలు. కానీ సీరియస్ సినిమాలు, అందునా 'రా' లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో రీసెర్చ్ చేయాలి, లాజిక్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ, జాక్ చిత్రంలో అవి కనిపించవు. తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం జాక్ తండ్రి(నరేష్) డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ముగింపు వరకు ఎక్కడా సినిమాలో వావ్ అనే మూమెంట్స్ లేవు. జస్ట్ అలా నడుస్తూ ఉంటుంది అంతే. స్పై థ్రిల్లర్స్ అనేవి ఎంతో సీరియస్ గా, నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తినిని కలిగిస్తూ థ్రిల్లింగ్ గా సాగాలి. కానీ జాక్ లో ఎక్కడా ఆ థ్రిల్ కనిపించదు. రా లాంటి సీరియస్ సబ్జెక్ట్ లోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అక్కడక్కడా సిద్ధు పలికే వన్ లైనర్స్ తప్ప, ఫన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసం అన్నట్టుగా రా ఆఫీసర్స్ ని మరీ సిల్లీగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే అసలు నిజంగా వాళ్ళని రా ఆఫీసర్స్ అనుకునే సీన్స్ రాశారా? అనే అనుమానం కలగక మానదు. అంత నెట్ వర్క్ ఉన్న రా కూడా కనిపెట్టలేని విషయాలను, జాక్ అనే మామూలు వ్యక్తి ఈజీగా కనిపెడుతూ ఉంటాడు. సీనియర్ మోస్ట్ రా ఆఫీసర్(ప్రకాష్ రాజ్) కూడా ఏం చేయలేక, జాక్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. హీరో పాత్రని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న ఈ సీన్స్ అన్నీ సిల్లీగా ఉన్నాయి. స్టోరీలో బలం లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. సీన్స్ ఎఫెక్టివ్ గా లేవు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. మెచ్యూరిటీ లేనివాడు రా ఏజెంట్ గా పనికిరాడు అని. కానీ, ఆ మెచ్యూరిటీ రైటింగ్ లో కనిపించదు. రా గురించి తగినంత రీసెర్చ్ చేయకుండా, మెచ్యూరిటీని పక్కన పెట్టి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు అనిపిస్తుంది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: జాక్ గా సిద్ధు జొన్నలగడ్డ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అయితే కొన్ని చోట్ల టిల్లునే కనిపిస్తున్నాడు. ఆ టిల్లు పాత్ర నుంచి బయటకు వచ్చి, సినిమా సినిమాకి నటుడిగా వైవిధ్యం చూపిస్తే బాగుంటుంది. బేగం అలియాస్ భానుమతిగా వైష్ణవి చైతన్య పరవాలేదు. కొన్ని సీన్స్ లో తన పర్ఫామెన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సిద్ధు, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేముంది. తాను పోషించిన రా ఆఫీసర్ పాత్రలో లోపాలున్నా, నటుడిగా మాత్రం ఆయన ఫెయిల్ అవ్వలేదు. హీరో తండ్రిగా నరేష్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కథకుడిగా, దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ నిరాశపరిచారు. బొమ్మరిల్లు, పరుగు వంటి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని అందించిన భాస్కర్.. కొత్తగా స్పై థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తే, అందుకు తగ్గట్టుగా ఎంతో కసరత్తులు చేస్తారని ఆశిస్తాం. మరి కసరత్తులు చేయలేదో, చేసిన కసరత్తులు సరిపోలేదో కానీ.. సినిమా మాత్రం ఆయన లాంటి సీనియర్ దర్శకుడు చేసిన ఫీలింగ్ ఎక్కడా కలగదు. విజయ్ కె. చక్రవర్తి కెమెరా పనితనం ఆకట్టుకుంది. పాటలు తేలిపోయాయి. నేపథ్య సంగీతం కూడా జస్ట్ ఓకే. కథనంలో పట్టు, సన్నివేశాలలో బలం లేకపోవడంతో ఎడిటర్ నవీన్ నూలి కూడా ఏం చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.   ఫైనల్ గా.. రా లాంటి సీరియస్ కథలోకి టిల్లు లాంటి కామెడీ క్యారెక్టర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది జాక్. అలా అని ఫన్ పేలలేదు, థ్రిల్ పండలేదు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సీనియర్ డైరెక్టర్, ఒక సీరియస్ కథని ఇంత సిల్లీగా తీస్తారని అసలు ఊహించలేము.   రేటింగ్: 2/5   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత  గురించి ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి, చల్లటి నీటి కోసం  తాపత్రయ  పడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలామందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే..   మట్టి కుండలు కొంటూ  ఉంటారు.   గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా,  పట్టణ ప్రాంత ప్రజలు అయినా   మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు.  ఎందుకంటే ఈ మట్టి  కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ  నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ  మార్కెట్లో రెండు రకాల మట్టికుండలు కనిపిస్తూ ఉంటాయి.  ఒకటి ఎరుపు రంగు కాగా.. మరొకటి నలుపు రంగు.  ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నలుపు రంగు కుండ.. నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది, అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ  కూడా మంచిదే అయినప్పటికీ, నల్లటి కుండతో  పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్‌తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి. కల్తీని ఎలా గుర్తించాలి.. కుండ  కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి, అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి, చల్లని  ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్చమైన మట్టి కుండను ఎంచుకోవాలి. కుండ మందం.. మట్టి కుండల  షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా, మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని  మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై  శ్రద్ధ వహించాలి. లీక్ టెస్ట్.. తరచుగా ప్రజలు మట్టి కుండ  కొనేటప్పుడు తొందరపాటులో లీక్ టెస్ట్ చేయడం మర్చిపోతారు.  తరువాత ఇంటికి వచ్చి కుండను నీటితో  నింపినప్పుడు కుండ లీకవ్వడం చూసి బాధపడతారు. కాబట్టి దుకాణంలోనే నీటిని పోసి లీక్ టెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచో నీళ్లు కారుతుండటం తెలుసుకోవచ్చు.  ఇలా చేయడం వల్ల  మళ్లీ మళ్లీ షాపుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ తప్పులు చేయకండి.. తరచుగా  అందానికి ఆకర్షితులై, మరింత మెరిసే కుండలను కొంటారు. అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు. కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి. దీనితో,  కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు.  నీటిని బయటకు తీయడానికి దాన్ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఇది నీటిని స్వచ్ఛంగా,  చల్లగా ఉంచుతుంది.   *రూపశ్రీ.
  పరీక్షలు.. పిల్లల జీవితాలను మార్చేవి.  ఏడాది మొత్తం చదివిన విషయాలను ఒక పరీక్షతో సమాధానాలు ఇచ్చి ప్రతిభను నిరూపించుకుంటేనే తదుపరి  తరగతికి లేదా తదుపరి దశకు అవకాశం ఉంటుంది.  అయితే పిల్లలు అయినా, పెద్దలు అయినా పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేటప్పుడు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలా ఒత్తిడికి గురైతే చదివిన విషయాలు గుర్తుండవు,  సిలబస్ తొందరగా పూర్తీ చేయలేం. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి. ఒత్తిడి తగ్గడానికి చాలా మంది శ్వాస వ్యాయామాలు చేస్తారు.  లోతైన శ్వాస అనేది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. కళ్లు మూసుకుని కొన్ని నిమిషాలు ధీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి అనేది దరిచేరదు. ఎప్పుడూ నాన్ స్టాప్ గా చదువుకుంటూ ఉంటారు కొందరు. దీని వల్ల తాము బాగా చదువుతున్నాం అనుకుంటారు. కానీ ఇలా నాన్ స్టాప్ గా చదువుకోవడం వల్ల మనసు  అలసిపోతుంది. అందుకే ప్రతి గంటకు కనీసం 5 నుండి 10 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ 5, 10 నిమిషాల సమయంలో నీరు త్రాగడం, కాస్త ధీర్ఘశ్వాస తీసుకోవడం,  అటు ఇటు నడవడం వంటి పనులు ఏదో ఒకటి చేయవచ్చు. ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే పరీక్షల ఒత్తిడి అనిపించదు. నిద్ర శరీరానికి ఔషధం వంటిది.   నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. మెదడు కూడా చురుగ్గా ఉండదు. అందుకే  ఎంత సిలబస్ ఉన్నా, పరీక్షలు ఎలాంటివి అయినా రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడం ముఖ్యం. అది కూడా కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం శరీరాన్నిమాత్రమే ఫిట్ గా ఉంచుతుంది అనుకుంటే పొరపాటు.  వ్యాయామం ఫిట్ గా ఉండటానికే కాకుండా మనసు ఏకాగ్రత పెరగడానికి,  ఒత్తిడి తగ్గడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది.  అందుకే రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. ఒక్కొకరికి ఒకో  అభిరుచి ఉంటుంది.  ఈ అభిరుచిని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.  కొందరు సంగీతం వింటారు.  కొందరు తోట పని చేస్తారు.  ఇలా నచ్చిన పని కొద్దిసేపు చేయడం వల్ల మనసు ఆందోళన తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ  సహకారంగా ఉంటారు.  ఒత్తిడిగా అనిపించిన సందర్భాలలో చదవాలని అనుకోవడం తప్పు.  ఒత్తిడిగా అనిపించినప్పుడు సింపుల్ పుస్తకాలు పక్కన పెట్టి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు సగం పైగా ఒత్తిడిని తగ్గిస్తాయి.   ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పరీక్షల కోసం బాగా చదవాలన్నా, పరీక్షలు బాగా రాయాలన్నా పరీక్షల గురించి పాజిటివ్ గా ఉండాలి. అలాగని పరీక్షలను లైట్ గా తీసుకోకూడదు. సీరియస్ గా చదువుతూనే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలం అనే నమ్మకం పెట్టుకోవాలి.                           *రూపశ్రీ.
  జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో మహావీర్ జయంతి ఒకటి. ఈ సంవత్సరం మహవీర్ జయంతి 2025 ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. ఇది జైన మతం  24వ  తీర్థంకరుడు అయిన  మహావీర్ 2623వ జన్మదినం  జైన మతంలో 24వ తీర్థంకరుడు అయిన మహావీరుడే చివరి తీర్థంకరుడు కూడా. మహావీర్ జయంతి  ఏప్రిల్ 9 లేదా ఏప్రిల్ 10 అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. జైన క్యాలెండర్,  సాంప్రదాయ పంచాంగం ప్రకారం మహావీర్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 10 న అవుతుంది. వర్ధమానుడు అని కూడా పిలువబడే  మహావీరుడు క్రీ.పూ. 599లో కుండలగ్రామ (ప్రస్తుత బీహార్‌లోని వైశాలి జిల్లా)లో జన్మించాడు. ఆధ్యాత్మిక గురువు అయిన మహావీరుడు జైనమతం  ప్రధాన సూత్రాలైన అహింస , సత్యం,  స్వాధీనత లేకపోవడం (అపరిగ్రహం)లను రూపొందించాడు. ఆయన 72 సంవత్సరాల వయస్సులో క్రీ.పూ 527లో మోక్షం పొందాడు. మహావీరుడి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు దేవాలయాలను సందర్శిస్తారు. ఊరేగింపులలో పాల్గొంటారు, ప్రార్థనలు చేస్తారు,  దానధర్మాలు చేస్తారు. శాంతి, కరుణ,  స్వీయ క్రమశిక్షణ మార్గాన్ని అనుసరించే లక్షలాది మంది భక్తులకు  మహావీరుడు స్ఫూర్తినిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా జైన భక్తులు మహావీర జయంతిని ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాలలో ఉత్సవాలు మారుతూ ఉంటాయి. కానీ సాధారణ ఆచారాలలో మహావీరుడి విగ్రహాన్ని రథయాత్ర అని పిలువబడే రథంపై మోసుకెళ్లడం కూడా ఉంటుంది. ఇది ఆయన బోధనల వ్యాప్తికి ప్రతీక. రథయాత్ర అంతటా ఆయన శిష్యులు భక్తి గీతాలు పాడుతూ, జైన మతానికి మహావీరుడు చేసిన కృషిని స్తుతిస్తారు. ఆ తరువాత ఆయన విగ్రహానికి ఆచార స్నానం లేదా అభిషేకం చేస్తారు. ఇది శుద్ధి,  పునరుద్ధరణను సూచిస్తుంది. ఈ ఆచారాలతో పాటు భక్తులు దానధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. ఇది మహావీరుడు తన కరుణను సమాజానికి తిరిగి ఇవ్వడంపై ఆయనకున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.   ప్రజలు మహావీరుడి  దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ప్రార్థనలలో పాల్గొంటారు.  ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరుకుంటారు. పూజారులు,  మత  నాయకులు ధర్మం,  స్వీయ-క్రమశిక్షణ మార్గంలో దృష్టి సారించే జైనమత సూత్రాలను ప్రోత్సహించడానికి బహిరంగ సమావేశాలు,  ఉపన్యాసాలను కూడా నిర్వహిస్తారు.                                       *రూపశ్రీ
ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు,   అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి.  ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో  వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట. కడుపు నిండుగా తినకూడదు.. పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా  ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట.  అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా  జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం.. తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని  అనుసరిస్తుందట.   మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి. సమయం.. రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది,  ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహార స్థితి.. ఆహారం చల్లగా అయిన తరువాత  మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత   గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉపవాసం.. అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట.  దీనికి బదులుగా  ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే   తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం.  దీని వల్ల  తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే  భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఉష్ణోగ్రత..  తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.  ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది.                                    *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పుచ్చకాయ వేసవిలో చాలామందికి ఇష్టమైన పండు. ఇందులో అధికశాతం నీరు ఉండటంతో పుచ్చకాయ తింటే వేసవి వేడిని అధిగమించవచ్చు.  అయితే పుచ్చకాయను తినడంలో చాలా మంది పొరపాటు చేస్తారు.  ఇలా పొరపాటుగా తినడం వల్ల పుచ్చకాయ శరీరానికి మంచి చేయకపోగా చెడు చేస్తుంది  అంటున్నారు ఆహార నిపుణులు.  పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు ఏంటి? పుచ్చకాయను ఎలా తింటే మంచిది? ఎలా తినకూడదు? పూర్తీగా తెలుసుకుంటే.. ఖాళీ కడుపు.. పుచ్చకాయలో అధిక మొత్తంలో సహజ చక్కెర,  నీరు ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లతత్వం,  జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందుగా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి.  ఆ తరువాతే పుచ్చకాయ తినాలని ఆహార నిపుణులు అంటున్నారు. భోజనం తరువాత.. చాలా మంది భోజనం తర్వాత పండ్లు  తింటూ ఉంటారు.   వేసవిలో తియ్యగా, చల్లగా ఉండే  పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే   కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. భోజనం చేసిన కనీసం ఒక గంట తర్వాత పుచ్చకాయ  తినడం మంచిది. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే.. చల్లటి పుచ్చకాయ రుచిగా ఉంటుంది. కానీ వెంటనే తినడం వల్ల గొంతు నొప్పి,  జలుబు వస్తుంది. మొదట గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం ఉంచి ఆ తర్వాత తినాలి. ఇది కాకుండా, ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో పుచ్చకాయ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. శరీరం దానిని సరిగ్గా జీర్ణం చేసుకునేలా చిన్న భాగాలలో తినాలి. ఉప్పుతో.. చాలా మంది పుచ్చకాయలో ఉప్పు వేసి తినడానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలా తింటే  మరింత తీపిగా,  జ్యుసిగా ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలియదు.  ఇది  శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతుంది. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా  ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉంటే పుచ్చకాయతో ఉప్పు తినడం పూర్తిగా మానేయాలి. ఎలా తినాలి.. ఎల్లప్పుడూ తాజాగా ఉన్న పుచ్చకాయను, ఇంట్లో నిల్వ చేయకుండా అప్పటికప్పుడు కట్ చేసుకున్న పుచ్చకాయను తినాలి.  చెడిపోయిన పుచ్చకాయ తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది, దీనిని ఎక్కువగా తినడం వల్ల తరచుగా మూత్రవిసర్జన,  కడుపులో భారంగా అనిపించవచ్చు. ఎల్లప్పుడూ పుచ్చకాయను ఒకదాన్నే తినాలి.   ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పండ్లను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. అయితే చాలామంది పండ్లు తినడం అంటే.. అదేదో అనారోగ్యం ఉన్నవాళ్లకు మాత్రమే అనే ఆలోచనతో ఉంటారు.  కానీ మారుతున్న జీవనశైలి కారణంగా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నేటి కాలం యోగా గురువులు,  వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. కానీ పండ్లను ఎప్పుడంటే అప్పుడు,  ఎలాగంటే అలా తినడం అస్సలు మంచిది కాదు.  పండ్లను సరైన పద్దతిలో తింటే శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.  ఇంతకీ పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుంటే.. మన రోజువారీ ఆహారంలో 30% తాజా పండ్లను చేర్చుకుంటే అది మన ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి  మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లలో సహజ చక్కెర, ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా పోషణను అందిస్తాయి.  సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణం కావడానికి ఎక్కువ శ్రమ అవసరమయ్యే బరువైన,  ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే, పండ్లు మనల్ని తేలికగా,  శక్తివంతంగా ఉంచుతాయి. పండ్లు తినడం వల్ల శరీరం శుభ్రపడి, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ఇది కాలేయం,  మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.  రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పండ్లు తినడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. భారీ ఆహారం తినడం వల్ల శరీరం నీరసంగా అనిపిస్తుంది. కానీ పండ్లు తినడం వల్ల శరీరానికి నిరంతర శక్తి అందుతూనే ఉంటుంది. పండ్లలో ఉండే సహజ చక్కెర శరీరంలో నెమ్మదిగా కరిగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. దీనివల్ల శరీరం రోజంతా చురుగ్గా ఉంటుంది. ఉదయాన్నే ఒక గిన్నె తాజా పండ్లు తీసుకోవాలి. స్నాక్స్ కు బదులుగా పండ్లు తినవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా ఆపిల్, అరటిపండు, నారింజ వంటి పండ్లను తినాలి. వివిధ పండ్లను కలిపి స్మూతీలు లేదా సలాడ్లు సిద్ధం చేసుకోవచ్చు. పండ్లను తాజాగా, సీజన్ వారిగా లో తినడం మంచిది. మనం శరీరంలోకి వెళ్లే ఇంధనం అది ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది. దీని అర్థం మనం ఆరోగ్యకరమైన,  సహజమైన ఆహారాన్ని తింటే.. మన శరీరం కూడా సరిగ్గా పనిచేస్తుంది. మన ఆహారంలో 30% పండ్లను చేర్చుకుంటే మన ఆరోగ్యం బాగుండటమే కాకుండా, రోజంతా చురుకుగా,  శక్తివంతంగా ఉంటాము.  ఈ చిన్న మార్పు చేసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు అన్నీ మెల్లగా బయటకు వెళ్లిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...